Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో వైరల్.. మొన్న కూతురు.. నేడు తండ్రి..
ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ పేరు చెబితేనే సెలబ్రెటీలు భయపడిపోతున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- January 15, 2024 / 05:11 PM IST
Sachin Tendulkar deepfake video goes viral
Sachin Tendulkar Deepfake video : ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ పేరు చెబితేనే సెలబ్రెటీలు భయపడిపోతున్నారు. ఇందుకు కారణం ఈ టెక్నాలజీ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడమే. ఆ మధ్య హీరోయిన్ రష్మిక మంధానకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియోపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. రష్మికనే కాదు చాలా మంది సెలబ్రెటీలు ఈ డీప్ ఫేక్ వీడియోల బారిన పడిన వారే. తాజాగా ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా చేరాడు.
ఓ గేమింగ్ యాప్‌నకు సచిన్ ప్రచారం చేస్తున్నట్లుగా డీప్ ఫేక్ వీడియో సృష్టించారు. దీన్ని చూసిన సచిన్ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశాడు. ఈ మేరకు తన డీప్ ఫేక్ వీడియోను ఎక్స్ (గతంలో ట్విటర్)లో షేర్ చేసి ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
NZ vs PAK : బ్యాటర్ సిక్స్ కొట్టగానే.. బాల్ తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా లగెత్తిన ఫ్యాన్
ఈ వీడియోలు నకిలీవని చెప్పారు. టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్‌లను ఎక్కడ కనిపించినా వెంటనే సంబంధింత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు అప్రమత్తంగా ఉంటూ.. ఇలాంటి వాటిపై వచ్చిన ఫిర్యాదుల పై వెంటనే స్పందించాలని కోరారు. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి అని సచిన్ కోరారు.
స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అనే గేమింగ్ యాప్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది. ఈ యాప్ ద్వారా డబ్బులు ఎలా వేగంగా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా ఉంది. కాగా.. సచిన్ కూతురు సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ వీడియో బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమె టీమ్ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటో వైరల్ అయ్యింది. ఆమె తన సోదరుడు అర్జున్ టెండూల్కర్‌తో దిగిన ఫోటోను మార్ఫింగ్ చేశారు. అర్జున్ పేస్ స్థానంలో గిల్ ముఖంతో మార్ఫింగ్ చేశారు.
Rohit Sharma : ధోని రికార్డును సమం చేసిన రోహిత్.. ఇంకొక్క మ్యాచ్ చాలు..!
