Sachin Tendulkar : బిగ్‌బాస్ విన్నర్ చేతిలో ఔటైన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్
క్రికెట్ దిగ్గజాలు, సెలబ్రిటీల సందడి మధ్య ఇండియన్ స్ట్రీట్ సూపర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) ఆరంభ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Updated on- March 7, 2024 / 11:40 AM IST
Sachin Tendulkar dismissed by Munawar Faruqui in ISPL 2024
Sachin Tendulkar – Munawar Faruqui : క్రికెట్ దిగ్గజాలు, సెలబ్రిటీల సందడి మధ్య ఇండియన్ స్ట్రీట్ సూపర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) ఆరంభ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. థానేలోని దడోజి కోనదేవ్ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకల్లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టెన్నిస్ బాల్‌తో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో భాగంగా మాస్టర్ ఎలెవన్, టీమ్ ఖిలాడీ జట్ల మధ్య ఓ ప్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించారు. మాస్టర్ ఎలెవన్ జట్టుకు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహించగా, టీమ్ ఖిలాడీ జట్టుకు అక్షయ్ కుమార్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులు అలరించాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించాడు.
ఆ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హిందీ బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌ను ఫరూఖీ వేశాడు. మొదటి బంతికి సచిన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. మాజీ ఆటగాడు నమన్ ఓజా క్యాచ్ అందుకోవడంతో సచిన్ ఔట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఐఎస్‌పీఎల్ టోర్నీ విషయానికి వస్తే.. టీ10 ఫార్మాట్‌లో జరగుతోంది. టెన్నిస్ బాల్‌తో నిర్వహించే ఈ టోర్నీలో 6 జట్లు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ లు పోటీ పడుతున్నాయి. మాజీ ముంబై ఫ్రాంచైజీని అమితాబ్ బచ్చన్, చెన్నై సింగమ్స్‌ను సూర్య శివకుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ హృతిక్ రోషన్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్టును సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేశారు.
PSL 2024 : కన్‌ఫ్యూజన్ కింగ్..! అటు.. ఇటు.. చివరికి.. నవ్వులు పూయిస్తున్న వీడియో
