PSL 2024 : క‌న్‌ఫ్యూజ‌న్ కింగ్‌..! అటు.. ఇటు.. చివ‌రికి.. నవ్వులు పూయిస్తున్న వీడియో

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ర‌నౌట్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

PSL 2024 : క‌న్‌ఫ్యూజ‌న్ కింగ్‌..! అటు.. ఇటు.. చివ‌రికి.. నవ్వులు పూయిస్తున్న వీడియో

Sarfaraz Ahmed run out

Pakistan Super League 2024 : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ కొన్ని స‌ర‌దా ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. వాటిని చూస్తుంటే న‌వ్వ‌కుండా ఉండ‌లేము. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ర‌నౌట్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో చోటు చేసుకుంది.

పాకిస్తాన్ సీనియ‌ర్ ఆట‌గాడు, వికెట్ కీప‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ పీఎస్ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ 2024లో భాగంగా బుధ‌వారం క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేట‌ర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. క్వెట్టా ఇన్నింగ్స్ 12వ ఓవ‌ర్‌లో స‌ర్ఫ‌రాజ్ ర‌నౌట్ అయ్యాడు.

IND vs ENG : పిచ్ పేస్‌కు అనుకూల‌మా? స్పిన్‌కా అన్న‌ది అన‌వ‌స‌రం.. ఐదో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జ‌ట్టు ప్ర‌క‌ట‌న

బ్లెస్సింగ్ ముజార‌బానీ ఈ ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతిని బ్యాక్‌వ‌ర్డ్ పాయింట్ దిశ‌గా ఆడాడు. వెంట‌నే ర‌న్ కోసం ప‌రిగెత్తాడు. అయితే.. బంతి అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న షోయ‌బ్ మాలిక్ వ‌ద్ద‌కు వెళ్లింది. వెంట‌నే అత‌డు బంతి ప‌ట్టుకుని స్ట్రైకింగ్ ఎండ్‌లోని వికెట్ల వైపుకు బాల్ ను విసిరి వేశారు. స‌ర్ఫ‌రాజ్ ర‌న్‌కు పిల‌వ‌డంతో నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు నిలబడిన రిలే రూసో స్ట్రైకింగ్ ఎండ్ వైపుగా క్రీజులోకి వ‌చ్చేశాడు.

అయితే.. మాలిక్ బాల్ అందుకోవ‌డాన్ని చూసిన స‌ర్ఫ‌రాజ్ త‌న మ‌న‌సు మార్చుకుని వెన‌క్కు ప‌రిగెత్తాడు. ఇద్ద‌రు బ్యాట‌ర్లు ఒక‌వైపున‌కు వెళ్లారు. మాలిక్ వేసిన బంతిని వికెట్ల తాక‌లేదు. అయితే.. ఆ బాల్‌ను అందుకున్న అన్వ‌ర్.. బౌల‌ర్ బ్లెస్సింగ్ ముజార‌బానీకి అందించాడు. అత‌డు వికెట్లు ప‌డ‌గొట్టాడు. రూసో మొద‌ట‌గా క్రీజును చేర‌డంతో చేసిది లేక స‌ర్ఫ‌రాజ్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ICC Test Rankings : టాప్‌-10లోకి దూసుకొచ్చిన య‌శ‌స్వి జైస్వాల్‌.. జాబితాలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎక్క‌డున్నాడంటే?

ల‌క్ష్య ఛేద‌న‌లో క‌రాచీ కింగ్స్ 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రెండు వికెట్లు కోల్పోయి 68 ప‌రుగులు చేసింది. షోయ‌బ్ మాలిక్ (2), టిమ్ సీఫెర్ట్ (27) లు క్రీజులో ఉన్నారు.