Arjun Tendulkar Birthday : కొడుకు అర్జున్‌కు సచిన్ టెండూల్కర్ అదిరిపోయే బర్త్‌డే విషెస్.. కొడుకు, కుమార్తె ఫొటోతో.. ఫ్యాన్స్ ఫిదా!

Arjun Tendulkar Birthday : భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు.

Arjun Tendulkar Birthday

Arjun Tendulkar Birthday : భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. అర్జున్ ఎదుగుదలను చూస్తూ ఉండటం తన జీవితంలో ఎంతో ఆనందాన్నిచ్చిన విషయాల్లో ఒకటని సచిన్ పేర్కొన్నారు.

Also Read : Rinku Singh : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల 2027 వ‌న్డే ప్రపంచ కప్ అవకాశాలపై రింకూ సింగ్ కామెంట్స్ వైర‌ల్..

సచిన్ ట్వీట్ ప్రకారం.. “నువ్వు ఈరోజు ఉన్నవ్యక్తిగా ఎదగడాన్ని చూడటం నా జీవితంలో గొప్ప ఆనందాల్లో ఒకటి. పుట్టినరోజు శుభాకాంక్షలు అర్జున్. నువ్వు ఎప్పటిలాగే నువ్వుగా ఉండటం కొనసాగించు” అంటూ సచిన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ తండ్రి-కొడుకుల అనుబంధాన్ని ప్రతిబింబించే సందేశం అభిమానులను ఆకట్టుకుంది. అదేవిధంగా పోస్టులో తన ఇద్దరు పిల్లలు అర్జున్, సారాలను ఆప్యాయంగా హత్తుకొని ఉన్న ఫొటోను సచిన్ టెండూల్కర్ షేర్ చేశారు.

తండ్రి సచిన్ టెండూల్కర్ బాటలోనే అర్జున్ టెండూల్కర్ సైతం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో తొలుత ముంబై తరఫున ఆడిన ఆయన ప్రస్తుతం గోవా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎడమచేతి వాటం బౌలర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా దేశవాళీ క్రికెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అర్జున్ ప్రయత్నిస్తున్నారు.