Arjun Tendulkar Wedding : ఘనంగా అర్జున్ టెండూల్కర్ పెళ్లి..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar Wedding)ఓ ఇంటివాడు అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Published On : March 5, 2026 / 03:22 PM IST
Sachin Tendulkar son Arjun Tendulkar Wedding complete
- ఓ ఇంటివాడు అయిన సచిన్ కొడుకు
- ఘనంగా అర్జున్ టెండూల్కర్ పెళ్లి
- సానియా చందోక్ తో
Arjun Tendulkar Wedding : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు అయ్యాడు. గురువారం తన ప్రియురాలు సానియా చందోక్‌ను పెళ్లి చేసుకున్నాడు. ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగినట్లు సమాచారం. వీరి పెళ్లికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు అయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సానియా ఎవరో కాదు అర్జున్ సోదరి సారా టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్ కావడం గమనార్హం.
ఐసీసీ ఛైర్మన్ జైషా, ఏపీ మంత్రి నారా లోకేష్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, రవిశాస్త్రి, యూసుఫ్ పఠాన్, ఆకాశ్ చోప్రా, ప్రజ్ఞాన్ ఓజా తదితరులు అర్జున్ పెళ్లికి హాజరు అయ్యారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Arjun Tendulkar, the son of Sachin Tendulkar, got married to Saaniya Chandhok today in Mumbai.❤️
Congratulations to Arjun and Saaniya. Best wishes for a happy life together. 💐 pic.twitter.com/HhkU9is64F
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026
ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు..
ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవిఘాయ్ మనవరాలు సానియా చందోక్. ఆమె కూడా వ్యాపారవేత్తే. ముంబైలో మిస్టర్ పాస్ పెట్ స్పా సంస్థను నడుపుతోంది. సచిన్ కూతురు సారాతో సానియాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ క్రమంలో అర్జున్‌తో పరిచయం కావడం, వారిద్దరు ప్రేమలో పడడం జరిగింది. గతేడాది ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.
