Sahibzada Farhan eye on Virat Kohli T20 world cup record
Virat Kohli : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ డకౌట్ అయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే.. గ్రూప్ దశలో నమీబియాతో జరిగిన పాక్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడాడు. ఈ డూఆర్ డై మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నమీబియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలుపొంది సూపర్-8కి అర్హత సాధించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయి ఉంటే అప్పుడు టోర్నీ నుంచి నిష్ర్కమించి ఉండేది. సూపర్-8కి ముందు సాహిబ్‌జాదా ఫర్హాన్ ఫామ్ అందుకోవడం పాక్‌కు బాగా కలిసి వచ్చే అంశం.
నమీబియాపై శతకం సాధించడంతో టీ20 ప్రపంచకప్ 2026లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సాహిబ్‌జాదా ఫర్హాన్ అగ్రస్థానంలో నిలిచాడు. అతడు నాలుగు మ్యాచ్‌ల్లో 220 పరుగులు సాధించాడు. ఇక ఇప్పుడు అతడి దృష్టి విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు పై ఉంది. కోహ్లీ రికార్డును అందుకునేందుకు ఫర్హాన్‌కు ఇంకో 100 పరుగులు మాత్రమే అవసరం. టీ20 ప్రపంచకప్ 2014లో కోహ్లీ 319 పరుగులు సాధించాడు.
ఫర్హాన్ గనుక కోహ్లీని అధిగమిస్తే.. ఓ టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. పాక్ సూపర్-8లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఫైనల్ చేరుకుంటే మరో రెండు మ్యాచ్‌లు అంటే మొత్తంగా ఐదు మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే కోహ్లీ రికార్డును పర్హాన్ అధిగమించే అవకాశం ఉంది.
ఓ టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* విరాట్ కోహ్లీ (భారత్) – టీ20 ప్రపంచకప్ 2014లో 319 పరుగులు
* తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) – టీ20 ప్రపంచకప్ 2009లో 317 పరుగులు
* బాబర్ ఆజామ్ (పాకిస్థాన్) – టీ20 ప్రపంచకప్ 2021లో 303 పరుగులు
* మహేలా జయవర్దనే (శ్రీలంక) – టీ20 ప్రపంచకప్ 2010లో 302 పరుగులు
* విరాట్ కోహ్లీ (భారత్) – టీ20 ప్రపంచకప్ 2022లో 296 పరుగులు