IND vs AFG : అఫ్గాన్‌తో టెస్టు.. సాయి సుద‌ర్శ‌న్ లేదా దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌లో నంబ‌ర్ 3లో ఆడేది ఎవ‌రు?.. కోచ్ ఏమ‌న్నాడంటే?

భార‌త్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య (IND vs AFG ) శ‌నివారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Sai Sudharsan or Devdutt Padikkal Who will play no 3 in IND vs AFG test

  • శ‌నివారం నుంచి భార‌త్‌, అఫ్గాన్ జ‌ట్ల మ‌ధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం
  • భార‌త్ త‌రుపున మూడో స్థానంలో ఎవ‌రు బ‌రిలోకి దిగుతారో అనే విష‌యం పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి
  • సాయి సుద‌ర్శ‌న్‌, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌ల మ‌ధ్య పోటీ

IND vs AFG : భార‌త్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భాగం కాన‌ప్ప‌టికి కూడా టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో పూర్తి స్థాయి జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగుతోంది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి నంబ‌ర్ 3 స్థానంలో ఎవ‌రు ఆడ‌తారు అనే దానిపైనే ప‌డింది.

ఛ‌తేశ్వ‌ర్ పుజారా రిటైర్‌మెంట్ త‌రువాత టెస్టుల్లో నంబ‌ర్ 3 స్థానంలో నిల‌క‌డ‌గా ఆడే ఆట‌గాడే ఆట‌గాడు దొర‌క‌డం లేదు. క‌రుణ్ నాయ‌ర్‌, సాయి సుద‌ర్శ‌న్‌ల‌తో పాటు ప‌లువురు ఆట‌గాళ్లు ఈ స్థానంలో బ‌రిలోకి దిగిన‌ప్ప‌టికి కూడా కూడా ఎవ్వ‌రూ అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయారు. ఇక అఫ్గానిస్థాన్‌తో ఎంపిక చేసిన జ‌ట్టులో దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌, సాయి సుద‌ర్శ‌న్‌లు నంబ‌ర్ 3 స్థానం కోసం పోటీప‌డుతున్నారు. వీరిద్ద‌రిలో తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకుని ఎవ‌రు నంబ‌ర్ 3 స్థానంలో ఆడ‌తారో అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

*Vaibhav Sooryavanshi : లార్డ్స్‌లో ఇంగ్లాండ్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి చ‌ర్చ‌.. వీడియో వైర‌ల్‌..

దీనిపై భార‌త స‌హాయ కోచ్ ర్యాన్ టెన్ డ‌స్క‌టే కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఎవ‌రు చోటు ద‌క్కించుకున్నా స‌రే వారికి స్థిరంగా అవ‌కాశాలు ఇస్తామ‌న్నాడు. ‘మూడో స్థానంలో చాలా మంది ఆట‌గాళ్లు ఆడారు. ఇది అంత మంచి విష‌యం కాదు. ప‌డిక్క‌ల్ ట‌న్నుల కొద్ది ప‌రుగులు చేసి వ‌స్తున్నాడు. సుద‌ర్శ‌న్ ఐపీఎల్‌లో చాలా బాగా ఆడాడు. ఆ పాత్ర‌కు ఎవ‌రు బాగా స‌రిపోతారో అనే విష‌య‌మై ఓ నిర్ణ‌యం తీసుకుంటాం. అది బ్యాటింగ్ చేయ‌డానికి చాలా క‌ష్ట‌మైన స్థానం. అదే స‌మ‌యంలో ఎంతో ముఖ్య‌మైన స్థానం. కాబ‌ట్టి ఎవ‌రికి ఛాన్స్ వ‌చ్చిన‌ప్ప‌టికి కూడా వారికి చాలా అవ‌కాశాలు ఇవ్వాల‌ని అనుకుంటున్నాము. ‘అని డ‌స్క‌టే తెలిపాడు.

ప‌డిక్క‌ల్ కే ఛాన్స్‌..!

దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్ల‌తో సంబంధం లేకుండా రాణిస్తున్నాడు. గ‌త ఆరు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో 60.33 స‌గ‌టుతో 543 ప‌రుగులు చేశాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 61 స‌గ‌టుతో 309 ప‌రుగులు చేశాడు. ఇక ఐపీఎల్ 2026లోనూ 33.14 స‌గ‌టు 168.72 స్ట్రైక్‌రేటుతో 464 ప‌రుగులు చేశాడు.

*Rishabh Pant : వైస్ కెప్టెన్సీ ఊస్ట్.. రిష‌బ్ పంత్‌కు గౌత‌మ్ గంభీర్ క్లాస్‌.. ఓ సీనియ‌ర్ ఆట‌గాడిగా నువ్వు..

ఇక సాయిసుద‌ర్శ‌న్ విష‌యానికి వ‌స్తే.. గత ఏడాది మూడో స్థానంలో ఆడిన‌ సాయి సుద‌ర్శ‌న్ పెద్ద‌గా రాణించ‌లేదు. అదే స‌మ‌యంలో ఫ‌స్ట్‌-క్లాస్ సీజ‌న్‌లోనూ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. అయితే.. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో 700కి పైగా ప‌రుగులు సాధించి గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్ చేరుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.