Sania Mirza : ఏదీ కష్టం.. పెళ్లి చేసుకోవడమా ? విడాకులు తీసుకోవడమా ?
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : January 17, 2024 / 06:51 PM IST
Sania Mirza shares cryptic post amidst divorce rumours with Shoaib Malik
Sania Mirza – Shoaib Malik : భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ దీనికి కారణం. ఆమె పాకిస్తాన్ క్రికెట్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకోనుందనే వార్తలకు ఈ పోస్ట్ మరింత ఆజ్యం పోసింది.
సానియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక కోట్‌ను పంచుకుంది.
“పెళ్లి కష్టమా.. విడాకులు తీసుకోవడం కష్టమా..?
ఊబకాయం కష్టమా.. ఫిట్‌గా ఉండటం కష్టమా..?
అప్పులు చేయడం కష్టమా.. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టమా..?
కమ్యూనికేషన్ కష్టమా. కమ్యూనికేట్ చేయకపోవడం కష్టమా..?”
వీటిలో మీరు వేటిని ఎంచుకుంటారు. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. అయితే.. అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి అనే కోట్‌ను సానియా పంచుకుంది.
షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. హైదరాబాద్‌లో 2010లో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. 2018లో వీరికి ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు. దాదాపు గత రెండు సంవత్సరాలుగా సానియా, షోయబ్‌లు విడిపోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
వీటిపై ఇంత వరకు కూడా వీరిద్దరు నేరుగా స్పందించలేదు. పాక్ నటి అయేషా ఉమర్‌తో మాలిక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండమే ఇందుకు కారణం అని వార్తలు రాగా.. ఆ వార్తలను అయేషా ఖండించింది.
Praggnanandhaa : ప్రజ్ఞానంద సంచలనం.. విశ్వనాథన్ ఆనంద్‌కు షాక్.. భారత టాప్ చెస్ ప్లేయర్‌గా..
ఇక వీరిద్దరు కూడా విడివిడిగా జీవిస్తుండడం కూడా పుకార్లకు మరింత ఆద్యం పోస్తోంది. ఇక ఇటీవల సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పోయబ్ మాలిక్ ఫోటోలను తొలగించగా, అటు షోయబ్ సైతం తన ట్విట్టర్ అకౌంట్ నుంచి సానియా మీర్జా పేరును తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా సానియా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు విడిపోవం ఖాయమని నెటిజన్లు అంటున్నారు.
