LSG : ఐపీఎల్ 2026 ముందు కీలక పరిణామం.. అమ్మకానికి లక్నో సూపర్ జెయింట్స్..!
లక్నో సూపర్ జెయింట్స్ (LSG)లో మైనారిటీ వాటాను విక్రయించాలని సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని RP-SG గ్రూప్ యోచినట్లు తెలుస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : March 12, 2026 / 02:03 PM IST
Sanjiv Goenka ready to sell minority stake sale in Lucknow Super Giants before IPL 2026
LSG : లక్నో సూపర్ జెయింట్స్ (LSG)లో మైనారిటీ వాటాను విక్రయించాలని సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని RP-SG గ్రూప్ యోచినట్లు తెలుస్తోంది. 15 శాతం వాటాని విక్రయించాలని RP-SG గ్రూప్ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఓ వైపు ఆర్‌సీబీ అమ్మకం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఈ వార్తలు రావడం గమనార్హం.
ఐపీఎల్ 2025 సీజన్‌లో జట్టు ఎదుర్కొన్న ఇబ్బందుల తరువాత సంజీవ్ గోయెంకా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనీకంట్రోల్ వెల్లడించింది. అయితే.. తుది నిర్ణయం పెట్టుబడిదారులు అందించే వాల్యుయేషన్ పై ఆధారపడి ఉంటుందని, ఆఫర్‌లు తగినంత ఆకర్షణీయంగా లేకుంటే గోయెంకా తన నిర్ణయం పై వెనక్కి తగ్గవచ్చునని పేర్కొంది.
Suryakumar Yadav : అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్యకుమార్ యాదవ్.. కోపంగా ఉండడంతో..
ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్ట్స్ లీగ్‌లలో ఐపీఎల్ ఒకటిగా అవతరించింది. యూఎస్‌లోని నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తరువాతి స్థానంలో ఐపీఎల్ ఉంది. 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ మీడియా హక్కులు $6.2 బిలియన్లకు వేలం వేయబడిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ క్రీడా వ్యాపార మార్కెట్లో భారీ సంచలనం సృష్టించాయి. ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికన్ క్రీడా పెట్టుబడిదారు డేవిడ్ బ్లిట్జర్‌తో కూడిన కన్సార్టియం రాజస్థాన్ రాయల్స్‌లో ప్రధాన వాటాను కొనుగోలు చేయడానికి రేసులో చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే లక్నో ఫ్రాంచైజీలోని కొంత వాటాను విక్రయించాలని గోయెంకా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
RP-SG గ్రూప్ నవంబర్ 2021లో లక్నో ఫ్రాంచైజీని రూ.7,090 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీని RPSG స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహిస్తున్నారు.
