Sanju Samson : గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్న సంజూ శాంసన్.. మళ్లీ డగౌట్లో కూర్చోవాల్సిందేనా..?
శ్రీలంక పర్యటనలో భారత జట్టు అదరగొడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 29, 2024 / 05:16 PM IST
Sanju Samson converts golden opportunity into golden duck
Sanju Samson golden duck : శ్రీలంక పర్యటనలో భారత జట్టు అదరగొడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. పల్లెకలె వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికి అభిమానుల అందరి దృష్టి సంజూ శాంసన్ పైను పడింది. ఈ మ్యాచ్‌లో అతడు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆడిన మొదటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడిపై తీవ్రమైన విమర్శల జడివాన మొదలైంది.
శుభ్‌మన్ గిల్ స్థానంలో సంజూశాంసన్‌కు అవకాశం ఇచ్చారు. ఓపెనర్‌గా వచ్చిన శాంసన్.. తీక్షిన వేసిన బంతిని అంచనా వేయడంలో విఫమై క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాగా.. శాంసన్ స్పిన్ బౌలింగ్‌లో తడబడడం ఇదే తొలిసారి కాదు. తన కెరీర్లో ఇప్పటి వరకు 25 ఇన్నింగ్స్‌లు ఆడిన శాంసన్ అందులో 22 సార్లు ఔట్ అయ్యాడు. ఇందులో 10 సార్లు స్పిన్నర్లకే వికెట్ సమర్పించాడు. స్పిన్ బౌలింగ్‌లో శాంసన్ 132 బంతులు ఆడాడు. 118 స్ట్రైక్‌రేటుతో 15 సగటుతో 156 పరుగులు మాత్రమే చేశాడు.
Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. ఈ ఏడాది ఇతనొక్కడే..
ఈ క్రమంలో అతడిపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. స్పిన్ బలహీనతను అధిగమించాలని సూచిస్తున్నారు. అవకాశాలు ఇవ్వడం లేదని అతడి ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తుంటే.. రాక రాక వచ్చిన అవకాశాలను సంజూ ఇలా వృథా చేసుకుంటున్నాడని నెటిజన్లు అంటున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అతడికి సపోర్టు చేస్తున్నారు.
మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే శాంసన్‌కు ఇచ్చే అవకశాలు తక్కువ అని, అప్పుడప్పుడు కాకుండా వరుసగా అవకాశాలు ఇస్తే.. తన సత్తాను నిరూపించుకుంటాడని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికి రెండో టీ20 మ్యాచ్‌లో డకౌట్ కావడంతో ఆఖరి టీ20 మ్యాచ్‌లో అతడికి చోటు దక్కుతుందో లేదో చూడాల్సిందే.
ENG vs WI : ఏంటి అన్నయా ఇదీ.. టెస్టు మ్యాచ్ అనుకున్నావా..? టీ20 అనుకున్నవా..? అంత తొందరేంది..?
