Shah Rukh Khan Jawan Review: ‘జవాన్’ సినిమాకు రివ్యూ ఇచ్చిన క్రికెటర్ దినేష్ కార్తీక్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షారూక్ ఖాన్
దినేష్ కార్తీక్ జవాన్ మూవీకి ఇచ్చిన రివ్యూకు షారూక్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. కార్తీక్ ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చారు.
- Harish Thanniru
- Published on- September 11, 2023 / 02:23 PM IST
Dinesh Karthik and Shah Rukh Khan
Shah Rukh Khan and Dinesh Karthik: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ మువీ దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వరుసగా నాలుగు రోజులు వందల కోట్లు కొల్లగొడుతూ సూపర్ హిట్ మూవీగా దూసుకెళ్తోంది. షారూక్ ‘జవాన్’ మూవీకి క్రికెటర్ దినేష్ కార్తీక్ రివ్యూ ఇచ్చారు. దీనిని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.
Novak Djokovic: టెన్నిస్ ను ఏలడానికే వచ్చాడు.. జొకోవిచ్ రికార్డు ఇప్పట్లో చెరిగిపోదా!
దినేష్ కార్తీక్ రివ్యూ ప్రకారం.. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్రంగా జవాన్ సినిమా నిలుస్తుందని నేను భావిస్తున్నానని అన్నారు. సినిమా డైరెక్టర్ అట్లీ.. షారూఖ్ ఖాన్‌ను ఎన్నో అవతారాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అద్భుతమైన ప్రయత్నం చేశాడు. 2018లో నేను కేకేఆర్‌తో ప్రయాణం ప్రారంభించినప్పుడు అట్లీ షారూక్ తో చర్చలు ప్రారంభించాడు. చెన్నైలో జరిగిన సీఎస్ కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కోసం అతను వచ్చాడు. దీనికి ఐదు సంవత్సరాలు పట్టింది. ఈ సినిమాకోసం డైరెక్టర్, షారూక్ మధ్య అనేకమార్లు చర్చలు జరిగాయని దినేశ్ అన్నారు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా ఉంది. మొత్తం జవాన్ టీంకు అభినందనలు అని దినేశ్ కార్తీక్ అన్నారు.
Ind vs Pak: వరుణుడు వదలట్లే..! ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ రద్దయ్యే అవకాశం? అదేంలేదంటూ ACC ట్వీట్
దినేష్ కార్తీక్ జవాన్ మూవీకి ఇచ్చిన రివ్యూకు షారూక్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. కార్తీక్ ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చారు. వావ్ డీకే మీరు చాలా సినిమా ప్రియులు. మీరు సినిమాను ఆస్వాదించినందుకు నిజంగా సంతోషంగా ఉంది. దీపిక (దినేష్ కార్తీక్ భార్య)కు నా అభినందనలు తెలపండి. మీరు ఖాళీగా ఉంటే కొన్ని వారాల తరువాత మళ్లీ జవాన్ సినిమా చూండండి.. ఫినిషర్ గా మీరు ఎల్లప్పుడూ కావాలి అంటూ షారూక్ ట్వీట్ లో పేర్కొన్నారు.
