Shikhar Dhawan : ధావన్ నోట పుష్ప డైలాగ్‌‌.. తగ్గేదే లే.. కేక పుట్టించాడుగా..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. పుష్పలో బన్నీ చెప్పే డైలాగ్.. తగ్గేదేలే.. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది.

Shikhar Dhawan Acting Pushpa Shikhar Dhawan Seen In ‘pushpa’ Avatar, Video Going Viral

Shikhar Dhawan Acting Viral Video : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మూవీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. పుష్పలో బన్నీ చెప్పే డైలాగ్.. తగ్గేదేలే.. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. ప్రతిఒక్కరూ ఇదే డైలాగ్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సినీప్రముఖులతో పాటు క్రికెటర్లు కూడా పుష్ప పాపులర్ డైలాగ్ కు ఫిదా అయిపోతున్నారు. భారత క్రికెట్ జట్టు బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కూడా పుష్ప డైలాగ్‌తో నెట్టింట్లో రచ్చ చేస్తున్నాడు. గతకొంతకాలంగా బెంచ్ కే పరిమితమైన ధావన్ ప్రస్తుతం వన్డే మ్యాచ్ కోసం ప్రీపేర్ అవుతున్నాడు.

సౌతాఫ్రికాతో జరుగబోయే వన్డే సిరీస్ లో ధావన్ ఆడనున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ధావన్.. ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఫన్నీ మీమ్స్‌, డ్యాన్స్‌లు, హిట్‌ సినిమాల్లోని పాపులర్‌ డైలాగ్‌లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. లేటెస్టుగా ‘పుష్ప’లోని సూపర్‌ హిట్‌ డైలాగ్‌ తగ్గేదేలే.. హిందీలో చెప్పి బన్నీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. పుష్ప… పుష్పరాజ్‌… మై ఝుకేగా నై(తగ్గేదేలే) అంటూ బల్ల బద్ధలు కొట్టేశాడు.. ధావన్ ఇన్ స్టాలో పోస్టు చేసిన వీడియో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.


అభిమాన హీరో పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని గబ్బర్‌ చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. గబ్బర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌‌కు గబ్బర్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతున్నారు బన్నీ ఫ్యాన్స్.. జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత జట్టులో ధావన్‌ కు చోటు దక్కింది. గతేడాదిలో శ్రీలంక పర్యటనలో టీమిండియాకు సారథ్యం వహించాడు.

Read Also : IPL Mega-Auction : రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా వేలం.. తేదీలు ఇవే..