Shivam Dube : ఏంద‌య్యా దూబె ఇదీ.. రింకూ కాద‌ని టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సెల‌క్ట్ చేస్తే.. బ్యాటింగ్ మ‌రిచిపోయావా ఏందీ?

రింకూ సింగ్‌ను కాద‌ని ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రువాత మెరుపులు మెరిస్తున్న శివ‌మ్ దూబెను జ‌ట్టులోకి తీసుకున్నారు.

Shivam Dube Golden Duck : భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టును ఇప్ప‌టికే బీసీసీఐ ప్ర‌క‌టించింది. 15 మంది స‌భ్యుల గల బృందానికి రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. కాగా.. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు న‌యా ఫినిష‌ర్‌గా పేరు తెచ్చుకున్న‌ రింకూ సింగ్ ను ఎంపిక చేయ‌లేదు. అత‌డిని రిజ‌ర్వ్ ఆట‌గాడిగా మాత్ర‌మే ప్ర‌క‌టించారు. దీంతో సెల‌క్ట‌ర్ల తీరుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

రింకూ సింగ్‌ను కాద‌ని ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రువాత మెరుపులు మెరిస్తున్న శివ‌మ్ దూబెను జ‌ట్టులోకి తీసుకున్నారు. ఈ నిర్ణ‌యాన్ని చాలా మంది త‌ప్పుబ‌ట్టారు. అయితే.. న‌లుగురు స్పిన్న‌ర్లు కావాల‌ని రోహిత్ శ‌ర్మ కోర‌డంతోనే రింకూను జ‌ట్టులోకి తీసుకోలేక‌పోయామ‌ని చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ చెప్పాడు.

RCB : ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జ‌ర‌గాల్సిందే

ఇదిలా ఉంటే.. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక అయిన త‌రువాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ శివ‌మ్ దూబె పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు. గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. రెండు మ్యాచుల్లో క‌లిపి క‌నీసం ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేదు. దీంతో అత‌డిపై ఎంపిక పై మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మొద‌లైంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు ద‌క్క‌డంతో శివ‌మ్ దూబె రిలాక్స్ అయ్యాడ‌ని, అత‌డి కంటే రింకూని ఎంపిక చేయాలంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న త‌రువాత పంజాబ్ కింగ్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ రెండు మ్యాచులు ఆడింది. చెపాక్ వేదిక‌గా ఏప్రిల్ 28న మ్యాచ్‌తో పాటు నేడు (మే 5 ఆదివారం) మ్యాచ్‌లోనూ దూబె డ‌కౌట్ అయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ దూబె తొలి బంతికే కావ‌డం గ‌మ‌నార్హం.

Dinesh Karthik : కాఫీ కూడా తాగ‌నివ్వ‌లేదురా అయ్యా.. ఆర్‌సీబీ వికెట్ల ప‌త‌నం పై దినేశ్ కార్తీక్‌

ట్రెండింగ్ వార్తలు