మూడో పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్‌.. సానియాతో విడాకులు నిజ‌మేనా?

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయ‌బ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ న‌టి స‌నా జావేద్‌ను అత‌డు వివాహం చేసుకున్నాడు.

Shoaib Malik marries Sana Javed amid rumours of separation with Sania Mirza

Shoaib Malik marries Sana Javed : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయ‌బ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. భార‌త మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలోనే అత‌డు పెళ్లి చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. పాకిస్తాన్ న‌టి స‌నా జావేద్‌ను అత‌డు వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను స్వ‌యంగా అత‌డే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

కాగా.. షోయ‌బ్ మాలిక్, సానియా మీర్జాలు 2010లో వివాహం చేసుకున్నారు. 2018లో వీరికి ఇజాన్ అనే కుమారుడు జ‌న్మించాడు. అయితే.. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా సానియా, షోయ‌బ్‌లు వేరువేరుగా ఉంటున్నార‌ని, ఇటీవ‌లే వీరిద్ద‌రు విడాకులు తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వీటిని ఇటు సానియాగానీ, అటు షోయ‌బ్ గానీ ధ్రువీక‌రించ‌లేదు. ఈ క్ర‌మంలోనే షోయ‌బ్ మరో పెళ్లి చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అయేషా సిద్ధిఖీ అనే యువతితో షోయబ్ కు మొదట పైళ్లైంది. ఆమెతో వివాహ బంధం తెంచుకున్న తర్వాత సానియాను పెళ్లాడాడు.

Also Read : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఓపెనింగ్ రేసు.. ముందంజ‌లో య‌శ‌స్వి జైస్వాల్‌.. వెనుక‌బ‌డిన శుభ్‌మ‌న్‌ గిల్

 

స‌నా జావేద్ విష‌యానికి వ‌స్తే.. పాకిస్తాన్‌ ప్ర‌ముఖ న‌టీమ‌ణుల‌లో ఆమె ఒక‌రు. 28 ఏళ్ల స‌నా అనేక టీవీ షోల్లో క‌నిపించింది. ‘ఏ ముష్త్‌-ఎ-ఖాన్‌’, ‘డంక్’ అనే షోలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు ఆమె చాలా మ్యూజిక్ వీడియోల‌లో క‌నిపించింది. 2020లో ఆమె ఉమైర్ జ‌స్వాల్‌ను వివాహం చేసుకుంది. కొద్దికాలానికే ఈ దంప‌తుల మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చాయి. వీరిద్ద‌రు త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి ఒక‌రి ఫోటోల‌ను మ‌రొక‌రు డిలీట్ చేశారు. దీంతో ఈ ఇద్ద‌రూ వీడాకులు తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

రెండు రోజుల కింద సానియా ఇన్‌స్టా పోస్ట్‌..
విడాకుల వార్తల మ‌ధ్య సానియా మీర్జా బుధ‌వారం సానియా త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక కోట్‌ను పంచుకుంది.
పెళ్లి కష్టమా.. విడాకులు తీసుకోవడం కష్ట‌మా..?
ఊబకాయం కష్ట‌మా.. ఫిట్‌గా ఉండటం కష్ట‌మా..?
అప్పులు చేయడం కష్ట‌మా.. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్ట‌మా..?
కమ్యూనికేషన్ కష్ట‌మా. కమ్యూనికేట్ చేయకపోవడం కష్ట‌మా..?”

Also Read: టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ కోసం డ్రాప్‌-ఇన్ పిచ్‌..! అంటే ఏమిటో తెలుసా?

వీటిలో మీరు వేటిని ఎంచుకుంటారు. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండ‌దు. ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. అయితే.. అది మ‌న చేతుల్లోనే ఉంటుంది. మ‌నం తెలివిగా నిర్ణ‌యాలు తీసుకోవాలి అనే కోట్‌ను సానియా పంచుకుంది.

ట్రెండింగ్ వార్తలు