Shreyas Iyer : చ‌రిత్ర సృష్టించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. కోహ్లీ రికార్డు స‌మం.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏకైక కెప్టెన్‌..

ఇంగ్లాండ్‌తో బ్రిస్ట‌ల్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

Shreyas Iyer equalls Virat Kohli record against England in T20s

  • నాలుగో టీ20 మ్యాచ్‌లో బ్యాట్‌తో అద‌ర‌గొట్టిన శ్రేయ‌స్ అయ్య‌ర్
  • 49 బంతుల్లో అజేయంగా 80 ప‌రుగులు
  • ప‌లు రికార్డులు న‌మోదు

Shreyas Iyer : ఇంగ్లాండ్‌తో బ్రిస్ట‌ల్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్ల సాయంతో అజేయంగా 80 పరుగులు చేశాడు. వ‌రుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన జట్టును ఆదుకున్నాడు. ఒంటరి పోరాటంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును అందించాడు.

ఈ మ్యాచ్‌లో భార‌త్ ఓ ద‌శ‌లో 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులో నిలిచిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పరిస్థితికి తగ్గట్టుగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. ఇన్నింగ్స్ చివ‌రిలో వేగం పెంచి ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

  • ఈ అజేయ ఇన్నింగ్స్‌తో శ్రేయస్ అయ్యర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఓ టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డును స‌మం చేశాడు. 2021లో కోహ్లీ ఇంగ్లాండ్ పై కెప్టెన్‌గా 80 పరుగులు చేశాడు.

Shreyas Iyer : ఆ ఒక్క త‌ప్పు వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్‌..

  • ఈ సిరీస్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్పటివరకు మొత్తం 190 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్‌ గడ్డపై ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. గ‌తంలో ఈ రికార్డు సూర్య‌కుమార్ యాద‌వ్ పేరిట ఉండేది. 2022లో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ 171 ప‌రుగులు సాధించాడు.
  • ఇంగ్లాండ్‌తో ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో రెండు సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన తొలి అంతర్జాతీయ కెప్టెన్‌గా కూడా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. శ్రేయ‌స్ రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్‌, జోష్ టంగ్‌లు చెరో రెండు వికెట్లు, విల్ జాక్స్‌, ఆదిల్ ర‌షీద్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఆ త‌రువాత 159 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 13.5 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోయి చేదించింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ (79 నాటౌట్; 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ఫిల్ సాల్ట్ (59 నాటౌట్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఇంగ్లాండ్ కోల్పోయిన ఏకైక వికెట్ ను అర్ష్‌దీప్ సింగ్ తీశాడు.