IND vs AFG : భారీ శతకాలతో చెలరేగిన శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్.. టీమ్ఇండియా భారీ స్కోరు..
లక్నోలోని ఎకానా స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు (IND vs AFG ) చెలరేగిపోయారు
- Thota Vamshi Kumar
- Updated on- June 17, 2026 / 05:36 PM IST
Shubman Gill and Ishan Kishan centuries helps indi 402 runs in 2nd ODI against Afghanistan
IND vs AFG : లక్నోలోని ఎకానా స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. దీంతో అఫ్గానిస్థాన్ ముందు 403 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
టీమ్ఇండియా బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154; 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (125; 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది.
TG 20 League : టీజీ20 లీగ్.. హీరో విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు
భారత బ్యాటర్లలో ఓపెనర్ రోహిత్ శర్మ (48; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రేయ్యర్ అయ్యర్ (26; 24 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (19 19 బంతుల్లో 1 ఫోర్) రాణించారు. యశస్వి జైస్వాల్ (4), కేఎల్ రాహుల్ (0)లు విఫలం అయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో నంగ్యాలియా ఖరోటి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. గజన్‌ఫర్, మహ్మద్ సలీమ్ సఫీలు చెరో వికెట్ పడగొట్టారు.
Innings Break!
A massive 4️⃣0️⃣2️⃣ runs on the board with centurions Shubman Gill and Ishan Kishan leading the way 💪
Our bowling innings coming up! ⌛️
Scorecard ▶️ https://t.co/JYJ5l44iJ6#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/T5rJ0qHsqy
— BCCI (@BCCI) June 17, 2026
