Shubman Gill : గెలిచాం కాబ్టటి సరిపోయింది.. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే.. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
న్యూజిలాండ్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Published on- November 7, 2026 / 05:07 PM IST
Shubman Gill comments after India won by 4 runs with DLS method in 2nd ODI against New Zealand
Shubman Gill : వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించగా.. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 41 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ (55; 104 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (31; 38 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లు తీశాడు. అకిల్ నబీ, అక్షర్ పటేల్, అన్షుల్ కాంబోబ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ తరువాత 135 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఈ దశలో వరుణుడు ఆటంకం కలిగించాడు. ఎంత సేపటికి వర్షం తగ్గలేదు. భారత్ 20 ఓవర్లు ఆడడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిని ఉపయోగించారు. 26 ఓవర్లకు డక్ వర్త్ లూయిస్ పద్దతిలో టీమ్ఇండియా 109 పరుగులుగా చేయాల్సి ఉండగా.. 4 పరుగులు ఎక్కువగానే చేసింది. దీంతో టీమ్ఇండియా విజేతగా నిలిచింది.
ఒకవేళ ఓడిపోయి ఉంటే..
మ్యాచ్ అనంతరం తమ జట్టు విజయంపై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఏదీ ఏమైనప్పటికి విజయం సాధించాం. అయితే.. మైదానంలో పరిస్థితులు అంత సులభంగా లేవు. మా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారని నేను భావిస్తున్నాను. ప్రత్యర్థిని 130–140 పరుగులకే పరిమితం చేయడం మంచి విషయం. ఒక దశలో ఇది సులభమైన లక్ష్యమే అనిపించినప్పటికీ, మేము వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చాం. చివరకు ఎలాగోలా విజయాన్ని అందుకున్నాం. అని గిల్ తెలిపాడు.
బౌలర్ల ప్రదర్శన గురించి మాట్లాడాడు. గత మ్యాచ్‌లోనూ గుర్నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతను మరిన్ని మ్యాచ్‌లు ఆడుతూ అనుభవం సంపాదించే కొద్దీ లైన్ అండ్ లెంగ్త్‌లో మరింత నిలకడ సాధిస్తాడని ఆశిస్తున్నా. అతనికి మంచి వేగం ఉంది. బంతిని బౌన్స్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. అతను ఇలాగే బౌలింగ్ కొనసాగిస్తే, జట్టుకు ఎంత విలువైన ఆటగాడిగా మారగలడో ఈరోజు మనం చూశాం.
Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో న్యూజిలాండ్ పై ఒకే ఒక్కడు..
మా జట్టులోని యువ బౌలర్లలో చాలామందికి అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ఒత్తిడిలో ఎలా రాణిస్తారనేదే. అంతర్జాతీయ క్రికెట్ అంటేనే ఒత్తిడిని తట్టుకుని ఆడటం. నిరంతరం బౌలింగ్ చేస్తూ అనుభవాన్ని సంపాదించుకోవడం. ఒత్తిడిలో కూడా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం. ఇదే మాకు చాలా కీలకం.
ఇక ఈ మ్యాచ్‌పై గురించి మాట్లాడుతూ.. పిచ్ ఖచ్చితంగా సవాలుగా ఉంది. అయితే.. ఆఖరిలో మేము ఆశించిన దానికంటే అదనంగా రెండు వికెట్లు కోల్పోయామని నా అభిప్రాయం. చివరలో వర్షం వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు. చివరిలో మేం ఆడిన ఆ రెండు షాట్లు కూడా సరైనవి కావు. ఒకవేళ డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో నాలుగైదు పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే, అది మాకు తీవ్ర నిరాశ కలిగించేది. ఏదేమైనా.. చివరికి విజయం సాధించడం సంతోషంగా ఉంది. అని శుభ్‌మన్ గిల్ అన్నాడు.
