Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. విండీస్‌తో మ్యాచ్‌లో గిల్ సాధించిన కీలక రికార్డులు ఇవే..

Shubman Gill : వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డబుల్ సెంచరీతో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.

Shubman Gill

Shubman Gill : మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత జట్టు.. రెండో మ్యాచ్ లోనూ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డుబుల్ సెంచరీ, రోహిత్ శర్మ సెంచరీతో పరుగుల వరద పారించడంతో తేలిగ్గా భారీ లక్ష్యాన్ని (406) భారత జట్టు చేధించి. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది.

Also Read : IND Vs WI : గిల్ డబుల్ ధమాకా.. రోహిత్ విధ్వంసం.. విండీస్‌పై భారత్ సిరీస్ కైవసం..!

వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదట్లోనే కెప్టెన్‌కు తగ్గ ఇన్నింగ్స్ ఆడిన అతడు కేవలం 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడు పెంచి 117 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

శుభ్‌మన్ గిల్ కెరీర్‌లో ఇది రెండో వన్డే డబుల్ సెంచరీ. 2023లో న్యూజిలాండ్‌పై హైదరాబాద్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన గిల్.. ఇప్పుడు వెస్టిండీస్‌పై మరోసారి 200 మార్క్‌ను అందుకున్నాడు. దీంతో వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ తర్వాత గిల్ నిలిచాడు.

వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఇప్పటివరకు భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరిట ఉంది. ఇషాన్ 2022లో బంగ్లాదేశ్‌పై 126 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ ఆ రికార్డును అధిగమిస్తూ కేవలం 117 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు.

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో గిల్ సాధించిన కీలక రికార్డులు..
♦ 117 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన గిల్.. వన్డే చరిత్రలో అత్యంత వేగవంతమైన 200 పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.
♦ వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా రెండు వన్డే డబుల్ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ గా నిలిచాడు.
♦ 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి.. భారత కెప్టెన్‌గా వేగవంతమైన వన్డే సెంచరీ సాధించిన ఘనతను దక్కించుకున్నాడు.
♦ 223* పరుగులతో వన్డేల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును గిల్ నమోదు చేశాడు.
♦ వన్డేల్లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అత్యధిక (333) పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. మార్టిన్ గప్తిల్ (342 రన్స్, 2015) తొలి స్థానంలో ఉన్నాడు.
♦ 2022 నుంచి వన్డేల్లో అత్యధిక (10) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న ఆటగాడిగా నిలిచిన శుభ్‌మన్ గిల్