Shubman Gill : రోహిత్ శర్మ చేసిన ఆ ఒక్క పని వల్ల మ్యాచ్ మొత్తం మారిపోయింది.. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కామెంట్లు..
న్యూజిలాండ్ పై తొలి వన్డేలో విజయం సాధించడం పట్ల టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Published on- November 4, 2026 / 05:24 PM IST
Shubman Gill key comments after Team India beat New Zealand in 1st ODI
Shubman Gill : న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ గెలుపు బోణీ కొట్టింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (38), బ్లెయిర్ టిక్నర్ (34), గ్లెన్ ఫిలిప్స్ (30)లు పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు, గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు, అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు తీశాడు.
Mitchell Santner : ఆ ఒక్క తప్పు వల్లే ఓడిపోయాం.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కామెంట్లు..
టీమ్ఇండియా ఛేజింగ్‌కు దిగిన తరువాత ఆటకు పలు మార్లు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలో తొలుత భారత టార్గెట్‌ను 40 ఓవర్లకు 167గా కుదించారు. ఆ తరువాత ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మరోసారి వర్షం పడింది. వర్షం శాంతించిన తరువాత ఆట మరలా ప్రారంభం కాగా.. టీమ్ఇండియా లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143గా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (74; 51 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకం చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (37; 56 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు.
ఇదే ప్రదర్శనను కొనసాగించగలిగితే చాలు..
మ్యాచ్ అనంతరం తొలి వన్డేలో విజయం పై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మా బౌలింగ్ చాలా బాగుంది. ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించాం. ముఖ్యంగా రోహిత్ భాయ్ చేసిన రనౌట్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. మిచెల్, ఫిలిప్స్ భాగస్వామ్యం కీలకంగా మారింది. భారత్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లోనూ వీరిద్దరూ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మొత్తంగా చూస్తే మా జట్టు సమష్టిగా అద్భుత ప్రదర్శన కనబరిచింది.
అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ల ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. అన్షుల్ లాంటి బౌలర్ ఇలాంటి పరిస్థితులకు చాలా సరిగ్గా సరిపోతాడు. అతను బంతిని వేగంగా విసరడమే కాకుండా, స్వింగ్ లేదా సీమ్ రాబట్టడంలో కూడా దిట్ట. పాత బంతితో కూడా అతను బాగా బౌలింగ్ చేస్తాడు. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించనప్పుడు, గుర్నూర్ బ్రార్ తన వేగంతో అదనపు బౌన్స్‌ను సృష్టించగలడు. ఈరోజు రాత్రి వీరిద్దరూ బౌలింగ్ చేసిన తీరు చూడటానికి చాలా అద్భుతంగా అనిపించింది. అని గిల్ అన్నాడు.
Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్లోనే ఏకైక ఆటగాడు..
వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఆడటంపై మాట్లాడుతూ.. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత వర్షం రావడం, ఆ తర్వాత పిచ్ వేగం పెరగడం, బంతి మరింత వేగంగా రావడం వంటి పరిస్థితులను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఆ తర్వాత లక్ష్యం కూడా తగ్గింది. అయినప్పటికీ మేము మా సహజమైన ఆటతీరును కొనసాగించడానికి ప్రయత్నించాం. ముఖ్యంగా విరాట్ భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు మా పనిని చాలా సులభతరం చేసింది. అని గిల్ తెలిపాడు.
రెండో వన్డేలోనూ తాము ఇదే ప్రదర్శనను కొనసాగించగలిగితే చాలు, మాకు కావాల్సింది స్థిరత్వం మాత్రమే. ఇలాగే పదేపదే రాణించగలిగితే, మేము చాలా మంచి స్థితిలో ఉంటాము. అని గిల్ అన్నాడు.
