India vs New Zealand : కివీస్‌తో నాల్గో వన్డేకు గిల్, రాహుల్ దూరం.. కొత్తగా జట్టులో చేరేది వీళ్లే.. ఓపెనర్లుగా ఎవరొస్తారంటే?
India vs New Zealand : న్యూజిలాండ్‌తో జరిగే నాల్గో వన్డేలో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముగ్గురు కొత్త ఆటగాళ్లు తుది జట్టులో చేరనున్నారు.
- Harish Thanniru
- Published on- November 12, 2026 / 12:18 PM IST
KL Rahu Shubman Gill
India vs New Zealand : న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తికాగా.. తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధించింది. మూడో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. దీంతో భారత్ తన 2-0 ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.
నాలుగో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్‌లో పుంజుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. చివరి రెండు వన్డేల కోసం టీమిండియా జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తప్పుకోగా.. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. గిల్, రాహుల్, అన్షుల్ కంబోజ్ టెస్టు సన్నాహకాల్లో భాగంగా వన్డే జట్టుకు దూరమయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల అనుభవం భారత్‌కు కీలకం కానుంది.
మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా మార్పులతో బరిలోకి దిగనుంది. గాయాలు, టెస్టు సిరీస్ సన్నాహాల కారణంగా పలువురు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని కివీస్ జట్టు భారత విజయయాత్రకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. అయితే, మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ మైదానంలో జరిగే ఈ పోరులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో ఆసక్తికరంగా మారింది. భారత జట్టు గెలిస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
నాల్గో వన్డేకు ఓపెన్లుగా ఎవరు క్రీజులోకి వస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపాలా? లేదంటే మిడిలార్డర్‌లో ఆడించాలా అనేది టీమిండియా సెలక్టర్ల ముందున్న ప్రశ్న. రోహిత్ శర్మతోపాటు ఇషాన్ కిషన్ ను ఓపెనర్‌గా పంపిస్తే బాగుంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. వారికి లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కుదురుతుంది. ఇదే జరిగితే రుతురాజ్ గైక్వాడ్‌ను నాలుగు లేదంటే ఐదో స్థానంలో పంపవచ్చు. గతంలో రుతురాజ్ ను నాలుగో స్థానంలో ఆడించారు. మరోవైపు..ఆకిబ్ నబీని రెండు మ్యాచ్ లలో ఆడిస్తే బాగుంటుందని చోప్రా పేర్కొన్నారు. ఒకవేళ అతను తుదిజట్టులోకి వస్తే మిడిలార్డర్ లో ఆడే అవకాశమే ఎక్కువగా ఉంటుందని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చారు.
ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టు ఇదే..
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, నమన్ ధీర్, అక్షర్ పటేల్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/మహ్మద్ సిరాజ్.
