Smriti Mandhana : పెళ్లి రద్దు తరువాత.. తెల్లటి డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న స్మృతి మంధాన..
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొంది. తెల్లటి వన్-పీస్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించింది. బుగ్గపై డింపుల్, ముఖంలో చిరునవ్వుతో ఉన్న ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : December 18, 2025 / 12:51 PM IST
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్లి రద్దైన తరువాత స్మృతి మంధాన ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొంది.
ఈ కార్యక్రమంలో మంధాన లుక్ అదిరిపోయింది.
వైట్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో స్మృతి మంధాన మెరిసిపోయింది.
సింపుల్ మేకప్, స్మైల్‌తో నెటిజన్లను, అభిమానులను ఆమె ఆకట్టుకుంది.
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమెను చూసిన నెటిజన్లు అచ్చం దేవకన్యలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
ఆమె ఉత్సాహంగా ఉండటం చూసి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
క్రికెట్ గ్రౌండ్‌లో స్మృతి సందడి మళ్లీ మొదలుకానుంది.
డిసెంబర్ 21 నుండి భారత్, శ్రీలంక జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్‌లో స్మృతి దుమ్ములేపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
