Ball of the century : ఏం బౌలింగ్ అన్నా ఇదీ! కువైట్ నుంచి ఒమ‌న్‌ వ‌ర‌కు స్పిన్ తిప్పావుగా!

క్రికెట్ చ‌రిత్ర‌లో ఎంతో మంది దిగ్గ‌జ బౌల‌ర్లు ఉన్నారు

క్రికెట్ చ‌రిత్ర‌లో ఎంతో మంది దిగ్గ‌జ బౌల‌ర్లు ఉన్నారు. వీరిలో స్పిన్న‌ర్లు చాలా మందే ఉన్నారు. అయితే.. వారంద‌రిలో స్పిన్ దిగ్గ‌జం, ఆసీస్ ఆట‌గాడు షేన్‌వార్న్ ప్ర‌త్యేక వేరు. ఆట‌లో అత‌డు ఎన్నో బంతులు వేసిన‌ప్ప‌టికీ ఓ బంతి మాత్రం చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. 1993లో యాషెస్ సిరీస్‌లో బాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీగా పేర్కొంటారు.

తాజాగా ఓ లెగ్ స్పిన్న‌ర్ అలాంటి బంతినే వేశాడు. కేసీసీ టీ20 ఛాలెంజ‌ర్స్ క‌ప్ 2024లో ఇది చోటు చేసుకుంది. కువైట్ నేష‌న‌ల్స్‌, ఎస్సీఎస్ సీసీ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. మ‌హ్మ‌ద్ వ‌కార్ అంజుమ్ కువైట్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అత‌డు ఓ అద్భుత బంతితో బ్యాట‌ర్ బియాంత్ సింగ్ ఔట్ చేశాడు. ఆఫ్ స్టంప్ కు చాలా దూరంలో పిచ్ అయిన బంతి స్పిన్ తిరుగుతూ లెగ్ వికెట్‌ను గిరాటేసింది.

Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.. దీనిని బాల్ ఆఫ్ ది సెంచ‌రీ అంటూ కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. బంతి కువైట్ నుంచి ఒమ‌న్ వ‌ర‌కు స్పిన్ అయింద‌ని ఒక‌రు అన్నారు. కాగా.. స‌ద‌రు బౌల‌ర్ బౌలింగ్ యాక్ష‌న్‌ భార‌త స్పిన్ దిగ్గ‌జం హ‌ర్భ‌జ‌న్ సింగ్ బౌలింగ్ ర‌న్ అప్‌లా ప్రారంభ‌మైంద‌ని, బాల్‌ను శ్రీలంక గ్రేట్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ లా విసిరాడ‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు