T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024.. రిషబ్ పంత్‌కు స్థానం.. గిల్‌కు దక్కని చోటు..
ICC T20 World Cup 2024 : ఇప్పుడు అందరి దృష్టి మరో ఏడు నెలలో ప్రారంభం కానున్న 2024 టీ20 ప్రపంచకప్ పై పడింది. భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ 2024లో టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననున్న టీమ్ఇండియా జట్టును అంచనా వేశాడు.
- Thota Vamshi Kumar
- Published On : November 22, 2023 / 05:27 PM IST
Sreesanth Team Indias squad
వన్డే ప్రపంచకప్ ముగిసింది. వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌ను ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడించింది. ఈ క్రమంలో ఆరో సారి కప్పును కైవసం చేసుకుంది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే కెరీర్ ముగిసిందనే అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి మరో ఏడు నెలలో ప్రారంభం కానున్న 2024 టీ20 ప్రపంచకప్ పై పడింది. భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ 2024లో టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననున్న టీమ్ఇండియా జట్టును అంచనా వేశాడు.
2023 వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న దాదాపు అందరూ ఆటగాళ్లకు తన జట్టులో చోటిచ్చాడు శ్రీశాంత్. అయితే.. ఇద్దరికి మాత్రం చోటు దక్కలేదు. రవిచంద్రన్ అశ్విన్, శుభ్‌మన్ గిల్ లకు స్థానం లభించలేదు. గిల్‌కు బదులుగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ను ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ ఆడతాడో లేదో అనే తెలియదు. ఒకవేళ అతడు ఆడితే మాత్రం అతడే కెప్టెన్‌గా ఉంటాడు అని శ్రీశాంత్ అన్నాడు. రోహిత్ ఆడకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉంటాడన్నారు.
Pat Cummins : ప్రపంచ ఛాంపియన్లను పట్టించుకోలేదు..! ఆశ్చర్యపోతున్న నెటీజన్లు
‘రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. అతడు ఐదు సార్లు ఐపీఎల్ కప్పును ముద్దాడినందున అతడే కెప్టెన్‌గా ఉంటాడు. పరిస్థితి, అవసరాలను బట్టి రోహిత్ లేదా హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.’ అని శ్రీశాంత్ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ చెప్పాడు.
గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ కోలుకుంటే అతడిని మూడో వికెట్‌గా పరిగణించాలని చెప్పాడు. ఎందుకంటే అతడు ఫామ్ అందుకునేందుకు కొంత కాలం పడుతుందని చెప్పాడు. కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్‌లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లలో పలువురు యువ ప్రతిభావంతులకు సెలక్టర్లు అవకాశం ఇవ్వాలన్నాడు.
శ్రీశాంత్ T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా.
Virat Kohli : కోహ్లీ మూడు, రోహిత్ నాలుగు.. వన్డేల్లో ఆధిపత్యం మామూలుగా లేదుగా..
