Sreesanth : చెంప దెబ్బ ఘ‌ట‌న‌.. హ‌ర్భ‌జ‌న్‌కు కోటి ఆదాయం.. శ్రీశాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఐపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో భార‌త మాజీ క్రికెట‌ర్లు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, శ్రీశాంత్ ల (Sreesanth) మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌నను అభిమానులు ఎవ‌రూ అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు

Sreesanth sensational allegations on Harbhajan Singh

  • ఐపీఎల్ 2008 సీజ‌న్ లో శ్రీశాంత్‌ను చెంప‌దెబ్బ కొట్టిన హ‌ర్భ‌జ‌న్‌
  • ఇటీవ‌ల ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన యాడ్ ద్వారా భ‌జ్జీ రూ.కోటి సంపాదించిన‌ట్లు శ్రీశాంత్ ఆరోప‌ణ‌

Sreesanth : 2008 ఐపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో భార‌త మాజీ క్రికెట‌ర్లు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, శ్రీశాంత్ ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ట‌నను అభిమానులు ఎవ‌రూ అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు. ఆ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు హ‌ర్భ‌జ‌న్ సింగ్, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌కు శ్రీశాంత్‌లు ప్రాతినిధ్యం వ‌హించారు. ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ త‌రువాత ఆట‌గాళ్లు క‌ర‌చాల‌నం చేసుకునే స‌మయంలో శ్రీశాంత్ చెంప పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ కొట్టాడు. శ్రీశాంత్ మైదానంలో క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌రువాత భ‌జ్జీ పై ఎనిమిది మ్యాచ్‌ల నిషేదం విధించారు.

ఇక ఈ ఘ‌ట‌న జ‌రిగి 18 ఏళ్లు పూర్తైంది. ఇటీవ‌ల ఐపీఎల్ మాజీ ఛైర్మ‌న్ ల‌లిత్ మోదీ దీని వీడియోను విడుద‌ల చేయ‌డంతో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే.. తాజాగా శ్రీశాంత్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. ఆ ఘ‌ట‌న‌ను ఉప‌యోగించుకుని భ‌జ్జీ కోటి రూపాయ‌ల లాభాన్ని పొందిన‌ట్లు ఆరోపించాడు.

Delhi Capitals : పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు షాక్‌.. నెట్స్‌లో గాయ‌ప‌డిన యువ ఆట‌గాడు

ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. తాను హ‌ర్భ‌జ‌న్ గురించి గ‌తంలో ఏ ఇంట‌ర్వ్యూలోనూ మాట్లాడ‌లేన‌ని చెప్పాడు. అప్ప‌టి చెంప దెబ్బ ఘ‌ట‌న‌ను తాను ప‌ట్టించుకోవ‌డం మానేశాన‌ని తెలిపాడు. అయితే.. హ‌ర్భ‌జ‌న్ ఇటీవ‌ల ఈ ఘ‌ట‌న పై ఓ యాడ్ చేశాడ‌ని, దాని నుంచి అత‌డు 80 లక్ష‌ల‌ నుంచి కోటి వ‌ర‌కు సంపాదించుకున్నాడ‌ని ఆరోపించాడు.

అక్క‌డితో భ‌జ్జీ ఆగ‌లేద‌న్నాడు. త‌న‌కు ఫోన్ చేసి మ‌రీ ఆ యాడ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌మ‌ని కోరాడ‌ని చెప్పుకొచ్చాడు. తాను చేయ‌న‌ని చెప్పాన‌ని ఇంకా హ‌ర్భ‌జ‌న్‌తో ఇలా అన్న‌ట్లు శ్రీశాంత్ తెలిపాడు. నేను నిన్ను క్ష‌మిస్తాను. కానీ ఆ ఘ‌ట‌న‌ను ఎన్న‌టికి మ‌రిచిపోను అని చెప్పిన‌ట్లు వెల్ల‌డించాడు. మీకు ఏదైన చెడు ఘ‌ట‌న జ‌రిగితే దానికి బాధ్యులైన వారిని క్ష‌మించాలి, కానీ ఆ చెడును మ‌ర్చిపోకూడ‌ద‌ని శ్రీశాంత్ తెలిపాడు.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఏకైక ఆట‌గాడు.. ఒక‌టి కాదు రెండు..

ఒక‌వేళ మ‌రిచిపోతే అవ‌త‌లి వ్య‌క్తి మ‌ళ్లీ అదే త‌ప్పు చేయాల‌ని చూస్తాడ‌ని అన్నాడు. ఇందుకు భ‌జ్జీనే ఉద‌హ‌ర‌ణ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అత‌డి ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేశాను అని శ్రీకాంత్ తెలిపాడు.