Sreesanth vs Gambhir : శ్రీశాంత్‌తో గంభీర్ గొడవ.. స్పందించిన భువనేశ్వరి.. నిజం చెప్పాలంటే..?
Sreesanth vs Gautam Gambhir : భారత మాజీ క్రికెటర్లు అయిన గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ లు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సి)లో ఆడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : December 7, 2023 / 05:50 PM IST
Sreesanth Wife Bhuvneshwari
భారత మాజీ క్రికెటర్లు అయిన గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ లు లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సి)లో ఆడుతున్నారు. ఇండియా క్యాపిటల్స్‌కు గౌతమ్ గంభీర్, గుజరాత్ జెయింట్స్‌కు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గౌతమ్ గంభీర్, శ్రీశాంత్‌ల మధ్య గొడవ జరిగింది. దీనిపై ఇప్పటికే శ్రీశాంత్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు. గంభీర్ తనను ఫిక్సర్ అని పదే పదే పలిచాడని, సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్ క్రికెటర్లకు గంభీర్ మర్యాద ఇవ్వడని శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ విషయంపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి స్పందించారు.
ఏం జరిగిందంటే..?
మ్యాచ్‌లో శ్రీశాంత్ వేసిన ఓ ఓవర్‌లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో గంభీర్ వైపు శ్రీశాంత్ సీరియస్‌గా చూడగా గంభీర్ సైతం కోపంగా అతడి వైపు చూశారు. ఆ తరువాత కాసేపటికే వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు ఆటగాళ్లతో పాటు అంపైర్లు వచ్చి వారిద్దరికి సర్దిజెప్పారు. మ్యాచ్ సజావుగా సాగేలా చూశారు. ఇక మ్యాచ్ అనంతరం దీనిపై సోషల్ మీడియాలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. తనను ఫిక్సర్ అని పిలిచాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
Virat Kohli : టీ20 ప్రపంచకప్ 2024 నుంచి కోహ్లీ ఔట్..? ప్రత్యామ్నాయ ఆటగాడు అతడేనా..?
తాను ఒక్క అసభ్యపదజాలం కూడా వాడలేదని, అతడు మాత్రం తనను పదే పదే ఫిక్సర్ అని పిలుస్తూనే ఉన్నాడు అని వీడియోలో శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. పక్కన ఉన్న వాళ్లను అతడిని ఆపుతున్నా కూడా అతడు ఫిక్సర్ అని పిలుస్తూనే ఉన్నట్లు తెలిపాడు. ఈ విషయంలో తన తప్పేమీ లేదని తెలిపాడు. అతడు మైదానంలో మాట్లాడిన మాటలు ఆయోదయోగ్యం కాదు. ఇప్పటికే నేను, నా కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. అభిమానుల మద్దతుతోనే పోరాడుతున్నట్లుగా శ్రీశాంత్ చెప్పాడు.
స్పందించిన భువనేశ్వరి..
శ్రీశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో పై అతడి భార్య భువనేశ్వరి స్పందించారు. శ్రీశాంత్‌తో కలిసి చాలా కాలం పాటు టీమ్ఇండియాకు ఆడిన ఓ ఆటగాడు ఇలా అన్నాడు అని తెలిసి షాక్‌కు గురైనట్లు చెప్పింది. యాక్టివ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన చాలా సంవత్సరాల తరువాత కూడా మైదానంలో అతడు ఇలా మాట్లాడడం అతడి ప్రవర్తనను తెలియజేస్తుంది. ఇది పద్దతి కాదు. నిజంగా ఈ ఘటన దిగ్భ్రాంతికరమైనది అని భువనేశ్వరీ వీడియో పోస్ట్ పై కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
Amit Patel : ఫుట్‌బాల్ జట్టుకు టోకరా.. రూ.183 కోట్లు కొట్టేసిన ప్రవాస భారతీయుడు
