SRH : అయ్యో.. కావ్య పాప‌కే ఎందుకు ఇలా జ‌రుగుతోంది? ఈ ఆసీస్ ఆట‌గాళ్లు ఉన్నారే..

ఐపీఎల్ 2026 టోర్నీకి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టును ప‌లు స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి

Sunrisers Hyderabad all rounder Jack Edwards ruled out of the IPL 2026

  • మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026
  • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను వెంటాడుతున్న ప్లేయ‌ర్ల గాయాలు
  • ఆల్‌రౌండ‌ర్ జాక్ ఎడ్వ‌ర్డ్స్ టోర్నీ నుంచి ఔట్‌

SRH : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆరంభం కానుంది. ఈ మెగాటోర్నీకి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టును ప‌లు స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈనేప‌థ్యంలో అత‌డు ఈ సీజ‌న్‌ ఆరంభంలోని ప‌లు మ్యాచ్‌లు ఆడ‌డ‌ని ఇప్ప‌టికే ఎస్ఆర్‌హెచ్ తెలిపింది. అత‌డి స్థానంలో ఇషాన్ కిష‌న్ జ‌ట్టుకు తాత్కాలిక సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని చెప్పింది.

ఇక ఇప్పుడు ఆల్‌రౌండ‌ర్ జాక్ ఎడ్వ‌ర్డ్స్ ఈ మెగాటోర్నీ నుంచి త‌ప్పుకున్నాడు. ఈ ఆస్ట్రేలియా ఆట‌గాడు తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆసీస్ దేశ‌వాళీ టోర్నీలో ఆడుతూ గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కేవలం ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడిన‌ప్ప‌టికి కూడా స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు అత‌డిపై న‌మ్మ‌కం ఉంచి మెగా వేలంలో 3 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

NZ vs SA : కీల‌క మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన ద‌క్షిణాఫ్రికా.. ఫ‌స్ట్ బ్యాటింగ్‌

పాట్ క‌మిన్స్ లేని లోటును ఎడ్వ‌ర్డ్స్ తీరుస్తాడ‌ని ఎస్ఆర్‌హెచ్ భావించ‌గా.. అత‌డు గాయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం వీరు దూరం కావడంతో స‌న్‌రైజ‌ర్స్ బౌలింగ్ బ‌ల‌హీనంగా మారింది. అత‌డి స్థానంలో ఎవ‌రిని తీసుకుంటారు అన్న దానిపై ప్ర‌స్తుతానికి ఎలాంటి స‌మాచారం లేదు.

ఐపీఎల్ 2026 ఆరంభ పోరులోనే స‌న్‌రైజ‌ర్స్ ఆడ‌నుంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఆరంభ‌పోరులో ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో త‌ల‌ప‌డ‌నుంది.