×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన శ్రీలంక‌.. స్టార్ ఆల్‌రౌండ‌ర్ పై వేటు.. క‌మిందు మెండీస్‌కు చోటు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 (T20 World Cup 2026) కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

Sri Lanka announced their 15 member squad for the T20 World Cup 2026

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2026కు శ్రీలంక క్రికెట్ బోర్డ్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఆల్‌రౌండ‌ర్ దాసున్ ష‌న‌క నాయ‌క‌త్వంలో శ్రీలంక జ‌ట్టు ఈ మెగాటోర్నీలో బ‌రిలోకి దిగ‌నుంది. క‌మిందు మెండీస్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు చివ‌రిసారిగా శ్రీలంక త‌రుపున 2025 న‌వంబ‌ర్‌లో టీ20 మ్యాచ్ ఆడాడు.

క‌మిందు మెండీస్ ఇప్ప‌టి వ‌ర‌కు 35 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 540 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో ఏమంత గొప్ప రికార్డు లేక‌పోయిన‌ప్ప‌టికి కూడా క‌మిందు మెండీస్ పై సెల‌క్ట‌ర్లు న‌మ్మ‌కం ఉంచి మెగాటోర్నీకి ఎంపిక చేశారు.

RCB players : బీచ్ ఒడ్డున సేద‌తీరుతున్న ఆర్‌సీబీ మ‌హిళా క్రికెట‌ర్లు.. స్మృతి మంధాన‌, శ్రేయాంక ఇంకా..

మ‌రోవైపు స్టార్ ఆల్ రౌండర్ ధనంజయ డిసిల్వాను పై వేటు ప‌డింది. అత‌డి పేలవ ఫామే అందుకు కార‌ణం. 2026లో డిసిల్వా మూడు ఇన్నింగ్స్‌ల్లో 43 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. బౌలింగ్‌లో అత‌డు ఒక వికెట్ మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. డిసిల్వా పై వేటు ప‌డిన‌ప్ప‌టికి కూడా పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్, కుసాల్ పెరెరా, చరిత్ అసలంక వంటి ఆల్‌రౌండ‌ర్లతో లంక జ‌ట్టు చాలా బ‌లంగా క‌నిపిస్తోంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమ‌న్‌, జింబాబ్వేల‌తో పాటు శ్రీలంక గ్రూప్ బిలో ఉంది. లంక జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్ ను ఫిబ్ర‌వ‌రి 8న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. కొలంబోని ఆర్ ప్రేమ‌దాస స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఆ త‌రువాత 12న ఒమ‌న్‌, ఫిబ్ర‌వ‌రి 16న ఆస్ట్రేలియాతో ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచ్‌ల‌కు ప‌ల్లెక‌లె ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇక గ్రూప్ ద‌శ‌లో చివ‌రి మ్యాచ్‌ను లంక జ‌ట్టు కొలంబో వేదిక‌గా 19న జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది.

Michael Vaughan : ద‌క్షిణాఫ్రికాకు అంత సీన్ లేదు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్ చేరే నాలుగు జ‌ట్లు ఇవే..


టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కు శ్రీలంక జ‌ట్టు ఇదే..
దాసున్ ష‌న‌క (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసాల్ మెండిస్, కమిందు మెండిస్, కుసల్ జనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, మతీషా చమీర.