Sri Lanka-India Series: కొవిడ్-19 కేసులు లంకతో టీమిండియా మ్యాచ్‌లు మార్చేశాయ్..

టీమిండియా.. లంకతో ఆడాల్సిన ఆరు మ్యాచ్ ల పరిమిత ఓవర్ల క్రికెట్ శుక్రవారం వాయిదా పడింది. ఆతిత్య జట్టులో కొవిడ్ కలకలం మొదలవడంతో జులై 13న జరగాల్సిన మ్యాచ్ జులై 17కు మార్చారు.

Sri Lanka-India Series: టీమిండియా.. లంకతో ఆడాల్సిన ఆరు మ్యాచ్ ల పరిమిత ఓవర్ల క్రికెట్ శుక్రవారం వాయిదా పడింది. ఆతిత్య జట్టులో కొవిడ్ కలకలం మొదలవడంతో జులై 13న జరగాల్సిన మ్యాచ్ జులై 17కు మార్చారు. శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లోర్, డేటా అనలిస్ట్ జీటీ నిరోశన్ లకు మహమ్మారి సోకి పాజిటివ్ అని తేలింది.

ఈ మేర శ్రీలంక క్రికెట్ బోర్డు మూడు రోజులు మాత్రమే ఉండాల్సిన క్వారంటైన్ పీరియడ్ ను మరింత పొడిగించింది. ‘అవును, సిరీస్ జులై 13కు బదులుగా జులై 17 నుంచి మొదలుకానుంది. ప్లేయర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని బీసీసీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు.

శ్రీలంక క్రికెట్ తో చర్చలు జరిపిన తర్వాతనే కొత్త డేట్స్ ఫిక్స్ చేశాం. జులై 17, 19, 21తేదీల్లో 50ఓవర్ల ఫార్మాట్ గేమ్ నిర్వహించాలనుకుంటున్నాం. మూడు టీ20లను జులై 24 నుంచి మొదలుపెట్టాలనుకుంటున్నాం. అని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు.

ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం.. జులై 13నుంచి మొదలైన వన్డే ఫార్మాట్.. జులై 16, జులై 18న జరగాల్సి ఉంది. టీ20 జులై 21, జులై 23, జులై 25న నిర్వహించాలని ప్లాన్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు