IND vs SL : టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా గెలవకుండా శ్రీలంక మాస్టర్ ప్లాన్.. అన్ని తెలిసి కూడా ఏం చేయకపోతున్న గిల్ సేన..
ఆగస్టు 15 నుంచి ఆతిథ్య జట్టు శ్రీలంకతో భారత్ (IND vs SL) రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది
- Thota Vamshi Kumar
- Updated on- August 6, 2026 / 04:01 PM IST
Sri Lanka Official Big Pitch Revelation Ahead Of Practice Match against India
IND vs SL : టీమ్ఇండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఆగస్టు 15 నుంచి ఆతిథ్య జట్టు శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. కాగా.. లంకలో పరిస్థితులకు అలవాటు పడడానికి టెస్టు సిరీస్ కన్నా ముందు టీమ్ఇండియా ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. శుక్రవారం నుంచి కొలంబోలోని నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC) మైదానంలో శ్రీలంక ఎలెవన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.
అయితే.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ పై భారత జట్టు యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సాధారణంగా శ్రీలంకలో పరిస్థితులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం పిచ్‌పై కొంత పచ్చికను (గడ్డి) ఉంచాలని శ్రీలంక క్రికెట్ (SLC) నిర్ణయించింది. ఈ నిర్ణయం భారత జట్టు యాజమాన్యానికి నచ్చలేదని తెలుస్తోంది.
Incredible Run Out : వార్నీ.. ఇలాంటి రనౌట్‌ను మీ జీవితంలో చూసి ఉండరు.. వీడియో వైరల్..
అయితే.. నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ అధికారి ఫ్రాంకే మాట్లాడుతూ.. ఈ పిచ్ మూడు రోజుల మ్యాచ్‌కు అనువైనదేనని స్పష్టం చేశారు. మ్యాచ్ ఫలితం అనేది జట్లు ఎలా ఆడతాయన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉందని టీమ్ఇండియా చెప్పింది. కానీ ఇది మూడు రోజుల మ్యాచ్ కావడంతో మేము సాధారణంగా ఇలాగే పిచ్‌ను సిద్ధం చేస్తాం. పూర్తిగా గడ్డి లేకుండా పిచ్ ఇవ్వడం సాధ్యం కాదు. ఈ ఒక్కటి మినహా మిగిలిన విషయాల్లో సంతోషంగానే ఉన్నారు. ఇది చాలా మంచి పిచ్. ఏ జట్టుకు అనుకూలంగా ఇప్పుడే చెప్పడం కష్టం. జట్లు ఎలా ఆడతాయో అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. పిచ్‌పై గడ్డిని ఉంచాలని శ్రీలంక క్రికెట్ బోర్డు కోరిందని అందుకనే ఉంచామని రెవ్‌స్పోర్ట్జ్‌తో మాట్లాడుతూ ఫ్రాంకే చెప్పాడు.
రెండో లేదా మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు సహకారం అందించే అవకాశం ఉందన్నాడు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిదని అన్నాడు. తాము ఎల్లప్పుడూ నాణ్యమైన, ఫెయిర్ పిచ్‌లనే సిద్ధం చేస్తామని అన్నాడు.
