×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు శ్రీలంక‌కు భారీ షాక్..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026 ) భాగంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు శ్రీలంక జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది.

Sri Lanka pacer Eshan Malinga has been ruled out of T20 World Cup 2026

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 నుంచి శ్రీలంక పేస‌ర్ ఎషాన్ మ‌లింగ త‌ప్పుకున్నాడు. భుజం గాయంతో ఇబ్బంది ప‌డుతున్న అత‌డు ఇంకా పూర్తిగా కోలుకోపోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. అత‌డి స్థానంలో ప్రమోద్ మదుషన్ ను జ‌ట్టులోకి తీసుకుంది.

25 ఏళ్ల ఎషాన్ మ‌లింగ ఫిబ్ర‌వ‌రి 1న ఇంగ్లాండ్‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు. అత‌డు ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యానికి కోలుకుంటాడ‌ని అంతా భావించారు. అయితే.. గాయం తీవ్ర‌మైన‌ది కావ‌డంతో లంక బోర్డు ఎలాంటి రిస్క్ తీసుకోవ‌ద్ద‌ని భావించింది. ఈ క్ర‌మంలోనే అత‌డు టోర్నీకి దూరం అయ్యాడు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలి మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. బుమ్రా దూరం

కాగా.. మ‌లింగ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన‌ ప్రమోద్ మదుషన్ శ్రీలంక త‌రుపున చివ‌రి సారిగా 2023 లో ఆడాడు. అత‌డు ఇప్ప‌టి వ‌ర‌కు లంక త‌రుపున 8 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో శ్రీలంక జ‌ట్టు.. ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, జింబాబ్వేలతో గ్రూప్‌-బిలో ఉంది. త‌మ తొలి మ్యాచ్‌ను శ్రీలంక ఫిబ్ర‌వ‌రి 8న ఆడ‌నుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

U19 World Cup 2026 : వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ఏం చెప్పాలో అర్థం కావ‌డం లేదు.. అత‌డొక‌.. ఆయుష్ మాత్రే కామెంట్స్ వైర‌ల్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 కోసం న‌వీక‌రించిన శ్రీలంక జ‌ట్టు ఇదే..

దసున్ షనక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్, కమిందు మెండిస్, కుసల్ జనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, మతీశ పతిరణ, ప్రమోద్ మదుషన్