×
Ad

T20 World Cup 2026 : భార‌త్‌తో మ్యాచ్‌కు పాక్ ఓకే.. ఊపిరి పీల్చుకున్న శ్రీలంక అధ్య‌క్షుడు.. వెంట‌నే పాక్ ప్ర‌ధానికి..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) భార‌త్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ జ‌ట్టుకు అనుమ‌తి ఇవ్వ‌డంతో పాక్ ప్ర‌ధానికి శ్రీలంక అధ్యక్షుడు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

Sri Lanka President thanks Pakistan PM for agreeing to play India in T20 World Cup 2026

T20 World Cup 2026 : ఎట్ట‌కేల‌కు పాకిస్థాన్ ప్ర‌భుత్వం దిగివ‌చ్చింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా కొలంబో వేదిక‌గా భార‌త్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్‌ జ‌ట్టుకు అనుమ‌తి ఇచ్చింది. సోమ‌వారం రాత్రి ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కు శ్రీలంక అధ్య‌క్ష‌డు అనుర కుమార దిస్సానాయక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. తాము చేసిన విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌కు మార్గం సుగ‌మం చేసినందుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

‘మ‌నంద‌రం ఎంతో ఇష్ట‌ప‌డే ఆట (భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌)కొనసాగేలా చూస్తున్నందుకు పాక్ ప్రధానమంత్రికి ధ‌న్య‌వాదాలు. షెడ్యూల్ ప్ర‌కారం కొలంబో వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 15న జ‌ర‌గ‌నున్న భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్ అనుకున్న ప్ర‌కారం జ‌ర‌గ‌నుంద‌ని తెలిసి సంతోషంగా ఉంది. ఇక ఈ మెగాటోర్నీకి స‌హ ఆతిథ్య దేశంగా.. ఐసీసీ చేసిన ప్ర‌య‌త్నాల‌ను ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం.

T20 World Cup 2026 : తొల‌గిన అనిశ్చితి.. భార‌త్‌తో మ్యాచ్‌కు పాక్ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ బిగ్ ప్రామిస్‌..

1996 ప్రపంచ కప్ స‌మ‌యంలో భ‌ద్ర‌తా కార‌ణాలు చూపుతూ ఇత‌ర దేశాలు శ్రీలంక‌లో ఆడేందుకు దూరంగా ఉన్న స‌మ‌యంలో భార‌త్‌, పాక్ జ‌ట్లు కొలంబోలో ఆడ‌డం ద్వారా చూపించిన సంఘీభావాన్ని శ్రీలంక ఎన్న‌టికి మ‌రిచిపోదు.’ అని అనుర కుమార దిస్సానాయక అన్నారు.

T20 World Cup 2026 : భార‌త్‌తో ఓట‌మి.. అమెరికా జ‌ట్టుకు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మెసేజ్‌.. నాకు తెలియ‌దు.. కానీ..

సోమ‌వారం సాయంత్రం శ్రీలంక అధ్యక్షుడు కూడా అనుర కుమార దిస్సానాయక పాక్ ప్ర‌ధానికి ఫోన్ చేసి.. భార‌త్‌తో మ్యాచ్  బ‌హిష్క‌రణ నిర్ణ‌యాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరారు. భార‌త్‌తో పాక్ జ‌ట్టు ఆడేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోతే శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర ఆర్థిక న‌ష్టాల‌ను చ‌విచూస్తుంద‌న్నారు. అంతేకాకుండా దేశ ప‌ర్యాట‌క రంగం కూడా తీవ్రంగా ప్ర‌భావితం అవుతుంద‌న్నారు.