Viral Video : నొవాక్ జకోవిచ్‌తో టెన్నిస్ ఆడిన ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. ఆశ్చర్యపోయిన టెన్నిస్ దిగ్గజం..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్‌తో కలిసి సరదాగా టెన్నిస్ మ్యాచ్ ఆడాడు.
- Thota Vamshi Kumar
- Updated on- January 11, 2024 / 04:41 PM IST
Steve Smith play tennis with Novak Djokovic
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌తో కలిసి సరదాగా టెన్నిస్ మ్యాచ్ ఆడాడు. గురువారం మెల్బోర్న్లోని పార్క్‌లోని టెన్నిస్ కోర్టులో వీరిద్దరి మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరిగింది. స్టీవ్‌స్మిత్ తన టెన్నిస్ నైపుణ్యంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. జకోవిచ్ సర్వీస్‌ను చాలా చక్కగా ఎదుర్కొన్నాడు. దీన్ని చూసిన జకోవిచ్.. తన రెండు చేతులతో స్మిత్‌కి అభివాదం తెలిపాడు.
టీ20 జట్టులోకి కోహ్లీ, రోహిత్‌ల ఎంపిక పై సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
ఆ తరువాత వీరిద్దరూ క్రికెట్ ఆడాడు. జకోవిచ్ బ్యాటింగ్ చేయగా స్మిత్ బౌలింగ్ చేశాడు. అయితే.. బ్యాట్ పట్టుకున్న జకోవిచ్ బాల్ ను మిస్ చేశాడు. ఆ తరువాత బ్యాట్‌ను పక్కకు పెట్టి టెన్నిస్ రాకెట్ చేతబట్టాడు. మరో బాల్ స్మిత్ వేయగా చక్కటి షాట్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే.. జనవరి 12 శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ఆరంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ అయిన జకోవిచ్ తన తొలి మ్యాచులో క్వాలిఫైయర్‌తో తలపడనున్నాడు. ఆ తరువాతి రౌండర్లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మార్క్ పోల్మన్స్ లేదా పాపిరిన్తో తలపడే అవకాశం ఉంది.
ఓపెనింగ్ చేయనున్న స్టీవ్ స్మిత్..
వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో వెస్టిండీస్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది. అయితే.. వన్డేలు, టెస్టులకు వార్నర్ వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతినిచ్చినందున అతను యాభై ఓవర్ల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహిస్తాడు.
