Nita Ambani : ముంబై ఇండియన్స్‌ను ట్రోల్ చేసిన విద్యార్థి.. పడి పడి నవ్వుకున్న నీతా అంబానీ.. వీడియో వైరల్
ఓ విద్యార్థి ముంబై ఇండియన్స్‌ను (Nita Ambani) ట్రోల్ చేయగా నీతా అంబానీ పడి పడి నవ్వారు.
- Thota Vamshi Kumar
- Updated on- May 25, 2026 / 01:30 PM IST
Student ribs Mumbai Indians Nita Ambani is in splits
Nita Ambani : ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఓ విద్యార్థి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌లో వైరల్ అవుతోంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన పై అతడు చమత్కారంగా మాట్లాడాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతా అంబానీ ఆ విద్యార్థి మాటలకు నవ్వుకున్నారు.
గ్రాడ్యుయేషన్ తరువాతి జీవితం గురించి విద్యార్థి మాట్లాడుతూ.. మనకు ఇష్టమైన ముంబై ఇండియన్స్ (MI) జట్టు మాదిరిగానే జీవితంలోనూ కొన్నిసార్లు కఠినమైన సీజన్లు ఉంటాయని అన్నాడు. అతడు ఈ మాట చెప్పిన వెంటనే ఆడిటోరియం మొత్తం నవ్వులతో నిండిపోయింది. పాఠశాల వ్యవస్థాపకురాలు, ముంబై ఇండియన్స్ యజమానీ అయిన నీతా అంభానీ అతడి మాటలకు నవ్వుతూ ముఖాన్ని చేతుల్లో కప్పుకోవడం కనిపించింది.
Kieron Pollard : హార్దిక్ పాండ్యాకు అన్నీ ఇచ్చాము.. కానీ.. కీరన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు..
అతడు తన మాటలను కొనసాగిస్తూ.. ఈ ఫ్రాంచైజీ మనందరికీ నేర్పిన ఒక విషయం ఏమిటంటే.. మీరు ఎవరో ఎప్పటికీ మర్చిపోకూడదు. మీ వారసత్వాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు, మీకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు అని అన్నాడు.
చివరగా అతడు “ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి దునియా హిలా దేంగే హమ్ ” అనే ముంబై ఇండియన్స్ నినాదాన్ని ప్రస్తావిస్తూ ముగించాడు. అతడి ప్రసంగం ముగిసిన వెంటనే నీతా అంబానీ చప్పట్లు కొట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడగా కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. 10 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 8 పాయింట్లతో పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానం (తొమ్మిదో)లో నిలిచింది. ఈ సీజన్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ ప్లేయర్లు అందరూ విఫలం అయ్యారు.
