Sunil Gavaskar : ఐపీఎల్ ఫైన‌ల్‌ను వాయిదా వేయాల్సింది.. సునీల్ గ‌వాస్క‌ర్ కామెంట్స్ వైర‌ల్‌..

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌ను వాయిదా వేయాల్సింది అన్న సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar) వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Sunil Gavaskar Says IPL 2026 Final Should have Been Postponed

Sunil Gavaskar : రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాల‌ని భావించిన గుజ‌రాత్ టైటాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో గుజ‌రాత్ ఓడిపోయింది. కాగా.. శుభ్‌మ‌న్ గిల్ నేతృత్వంలోని గుజ‌రాత్ జ‌ట్టు కేవ‌లం 6 రోజుల వ్య‌వ‌ధిలోనే మూడు మ్యాచ్‌లు ఆడాల్సి వ‌చ్చింది. ఇందులో రెండు నాకౌట్ మ్యాచ్‌లు కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో రెండు ఆర్‌సీబీ చేతుల్లోనే ఓడిపోయింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో వారి స్టార్ ఆట‌గాళ్లు రాణించ‌క‌పోవ‌డంతో ఓట‌మి పాలైంది.

కాగా.. ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభ‌మైన త‌రువాత భార‌త క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారి ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలగడంతో గుజరాత్‌కు తగినంత విశ్రాంతి లభించలేదన్నాడు. కాబట్టి ఈ మ్యాచ్‌ను (ఫైన‌ల్‌ను) వాయిదా వేయాల్సిందని అన్నారు.

Rajat Patidar : అస‌లు కెప్టెన్‌గానే ఉంటాన‌ని అనుకోలేదు.. ఇక క‌ప్పు గురించి అయితే.. ర‌జ‌త్ పాటిదార్ హాట్ కామెంట్స్..

శ‌నివారం సాయంత్రం ఆల‌స్యంగా అహ్మ‌దాబాద్‌కు చేరుకున్న గిల్ నేతృత్వంలోని గుజ‌రాత్ జ‌ట్టు 24 గంట‌ల కంటే త‌క్కువ స‌మ‌యంలోనే ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్ ఆడింది. బిజీ షెడ్యూల్‌, ప్ర‌యాణం వ‌ల్ల జ‌ట్టుపై ప‌డిన ప్ర‌భావం వ‌ల్ల ఆట‌గాళ్లు అల‌స‌ట‌కు గురి అయ్యారా? అని గుజ‌రాత్ క్రికెట్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ సోలంకిని అడిగిన‌ప్పుడు ఓట‌మికి దానిని సాకుగా వాడుకోల‌వాల‌ని అనుకోవ‌డం లేద‌న్నాడు.

మ్యాచ్ అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో సోలంకి మాట్లాడుతూ.. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఓడిపోయాం. వాతావర‌ణాన్ని నేను నియంత్రించ‌లేను. వాతావ‌ర‌ణం కారణంగా మేము ఆల‌స్యంగా అహ్మ‌దాబాద్ చేరుకున్నాము. దీనికి మేము ఎవ‌రిని నిందించ‌లేము, ఏమీ చేయ‌లేము అని అన్నాడు.

Shubman Gill : ఓడిపోయామ‌ని ఈ విష‌యం చెప్ప‌డం లేదు.. గెలిచినా కూడా ఇదే చెప్పేవాడిని.. శుభ్‌మ‌న్ గిల్ హాట్ కామెంట్లు

ఆరు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడ‌డం పై స్పందిస్తూ అది స‌వాల్‌తో కూడుకున్న‌దేన‌ని అన్నాడు. సీజ‌న్ చివ‌రిలో ఇలాంటివి స‌హ‌జ‌మేన‌ని అన్నాడు. ఇదే ఓట‌మికి కార‌ణం కాదు. ఆర్‌సీబీని నిలువ‌రించే అవ‌కాశం మాకు వ‌చ్చింది. కొన్ని విభాగాల్లో విఫ‌లం అయ్యాము. కానీ వారు ఈ రోజు చాలా అద్భుతంగా ఆడారు. వారి విజ‌యాన్ని త‌క్కువ చేయ‌డం భావ్యం కాదు. అది మా నైజం కాదు. ఇక ఈ సీజ‌న్‌లో మా జ‌ట్టు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అని విక్రం సోలంకి అన్నాడు.