Sunil Narine : చ‌రిత్ర సృష్టించిన సునీల్ న‌రైన్‌.. 19 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఏకైక ఆటగాడు..

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ ఆటగాడు సునీల్ న‌రైన్ (Sunil Narine) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Sunil Narine Creates history become the first player 200 wickets for a single franchise in IPL

  • ఐపీఎల్‌లో సునీల్ న‌రైన్ అరుదైన ఘ‌న‌త‌
  • 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ఆట‌గాడు
  • ఒకే ఒక ఫ్రాంచైజీ త‌రుపున 200 వికెట్లు ప‌డ‌గొట్టిన ఏకైక ఆటగాడు

Sunil Narine : కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ ఆటగాడు సునీల్ న‌రైన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో ఒకే జ‌ట్టు త‌రుపున 200 వికెట్లు తీసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఆదివారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. సలీల్ అరోరాను క్లీన్ బౌల్డ్ చేసి ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఓ ఫ్రాంచైజీ త‌రుపున 200 వికెట్లు తీసిన ఆట‌గాడిగా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్‌లో న‌రైన్ నాలుగు ఓవ‌ర్లు వేసి 31 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. రెండు వికెట్లు సాధించాడు.

Pat Cummins : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఓట‌మికి కార‌ణం నేనే..

ఐపీఎల్‌లో ఓ ఫ్రాంఛైజీ త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన ప్లేయ‌ర్లు వీరే..

* సునీల్ న‌రైన్ – 200 వికెట్లు (కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ త‌రుపున‌)
* జ‌స్‌ప్రీత్ బుమ్రా – 186 వికెట్లు (ముంబై ఇండియ‌న్స్ త‌రుపున‌)
* ల‌సిత్ మ‌లింగ – 170 వికెట్లు (ముంబై ఇండియ‌న్స్ త‌రుపున‌)
* భువ‌నేశ్వ‌ర్ కుమార్ – 157 వికెట్లు (స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌రుపున‌)
* ర‌వీంద్ర జ‌డేజా – 143 వికెట్లు (చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున‌)
* యుజ్వేంద్ర చహ‌ల్ – 139 వికెట్లు (రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌రుపున‌)
* డ్వేన్ బ్రావో – 139 వికెట్లు (చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున)

తొలి విదేశీ ఆట‌గాడు..

ఐపీఎల్ చ‌రిత్ర‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ ఆట‌గాడిగా నిలిచాడు. ఓవ‌రాల్‌లో ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు. చహ‌ల్‌, భువ‌న్వేశ‌ర్ కుమార్‌కు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. చ‌హ‌ల్ 228 వికెట్లు ప‌డ‌గొట్టగా భువీ 215 వికెట్లు సాధించాడు.

Shreyas Iyer : గుజ‌రాత్‌తో మ్యాచ్ పోతే పోయింది.. స‌న్‌రైజ‌ర్స్‌కు చుక్క‌లు చూపిస్తాం.. శ్రేయ‌స్ అయ్య‌ర్ హాట్ కామెంట్స్‌..

ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* చ‌హల్ – 228 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 215 వికెట్లు
* సునీల్ నరైన్ – 201 వికెట్లు
* పీయూష్ చావ్లా – 192 వికెట్లు
* ర‌విచంద్ర‌న్ అశ్విన్ – 187 వికెట్లు