IPL 2026 : ఎస్ఆర్‌హెచ్ హ్యాట్రిక్ విజయం.. కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్.. అంతా వారి వల్లనే..
IPL 2026 : ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్ జట్టు ఘన విజయం సాధింది.
- Harishth Thanniru
- Updated on- April 22, 2026 / 06:55 AM IST
Ishan Kishan
- ఉప్పల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు
- 47 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజయం
- సెంచరీతో విరుచుకుపడిన ఓపెనర్ అభిషేక్ శర్మ
- మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక కామెంట్స్
IPL 2026 : ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ జట్టు ఘన విజయం సాధింది. తొలుత ఎస్ఆర్‌హెచ్ జట్టు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో 242 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (135 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. కీలక కామెంట్స్ చేశారు.
Also Read : SRH vs DC : శతకంతో చెలరేగిన అభిషేక్ శర్మ.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇషాన్ కిషన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా అతనికే దక్కుతుందని చెప్పాడు. అభిషేక్ విధ్వంసం.. క్లాసెస్ ఫినిష్ చేసిన విధానం చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ముఖ్యంగా బంతి పాతబడే కొద్దీ షాట్లు ఆడటం కష్టమైంది. అలాంటి వికెట్ పై 230కంటే ఎక్కువ పరుగులు చేస్తే విజయంపై ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదని ఇషాన్ అన్నారు. అయితే, ఈ మ్యాచ్ విజయం క్రెడిట్ మొత్తం అభిషేక్ శర్మకే దక్కుతుందని ఇషాన్ పేర్కొన్నారు.
Twin strikes from #SRH‘s man-in-form 🧡
Nitish Rana and David Miller fall to Eshan Malinga on 🔙 to 🔙 deliveries! ☝️☝️
Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/kgmP8W7jTs
— IndianPremierLeague (@IPL) April 21, 2026
ఇలాంటి వికెట్లపై షాట్స్ ఆడటం అంత సులువు కాదు. హర్ష్ దూబే గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా అతను మంచి బంతులు వేయగలడు. అతను చాలా తెలివైన బౌలర్ అంటూ ఇషాన్ కిషన్ ప్రశంసించారు. ప్రత్యర్థి జట్టులో ఇద్దరు అత్యుత్తమ బ్యాటర్లు క్రీజులో ఉన్న సమయంలో మన బెస్ట్ బౌలర్లను రంగంలోకి దించడమే మా ప్లాన్. అది మాకు బాగా పనిచేసింది. డ్రెస్సింగ్ రూమ్ లో నేను ఎక్కువగా మాట్లాడను. కేవలం ఆటను ఆస్వాదించండి అని మాత్రమే చెబుతుంటాను అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
Explosive with the bat 🔥
Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1
— IndianPremierLeague (@IPL) April 21, 2026
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో తొలిసారి 240 పరుగుల ప్లస్ మార్కును దాటింది. చివరి ఓవర్లలో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచరీతో ఢిల్లీ పని పట్టిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
