SRH vs DC : శతకంతో చెలరేగిన అభిషేక్ శర్మ.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
ఢిల్లీ క్యాపిటల్స్ ముందు సన్రైజర్స్ హైదరాబాద్ భారీ లక్ష్యాన్ని (SRH vs DC) ఉంచింది.
IPL 2026 SRH vs DC Delhi Capitals target is 243 (pic credit@ipl)
SRH vs DC : ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర (135 నాటౌట్ ; 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు) శతకం బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 243 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ (37; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు. ఎడాపెడా ఫోర్లు సిక్సర్లతో ఈ జంట పోటాపోటీగా బౌండరీలు బాదారు. 8.5 ఓవర్లలోనే 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని అందించారు.
INNINGS BREAK!
A breathtaking century from Abhishek Sharma and late fireworks power #SRH to a massive 2️⃣4️⃣2️⃣! 💥
Can #DC pull off a monumental chase? 🤔
Scorecard ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC pic.twitter.com/cdaJi92pNB
— IndianPremierLeague (@IPL) April 21, 2026
మరోవైపు అభిషేక్ శర్మ తొలి బంతి నుంచే తనదైన శైలిలో బౌలర్ల పై ఆధిపత్యం చెలాయించాడు. ఈక్రమంలో 47 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కూడా బౌలర్లకు చుక్కలు చూపించాడు. రెండో వికెట్కు ఇషాన్ కిషన్ (25; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) తో 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అభిషేక్.. ఆ తరువాత హెన్రిచ్ క్లాసెన్(37 నాటౌట్ ; 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల)అభేద్యమైన మూడో వికెట్ కు 32 బంతుల్లోనే 66 పరుగులను జోడించాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు.
