SRH Schedule : సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే..
ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH Schedule) నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- March 11, 2026 / 09:57 PM IST
SunRisers Hyderabad IPL 2026 Schedule here
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ విడుదల
- నాలుగు మ్యాచ్‌లు ఆడనున్న సన్‌రైజర్స్
SRH Schedule : ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల వారిగా విడుదల చేస్తామని చెప్పిన బీసీసీఐ తాజాగా మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన తర్వాత మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది.
ఇక తొలి దశ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఓ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ఆడనుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు ఇతర వేదికలపై ఆడనుంది.
Jemimah rodrigues : సముద్రంలో జలకాలాడుతున్న భారత మహిళా ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌బీసీ)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్చి 28న తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఏప్రిల్ 2న కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో, ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో, ఏప్రిల్ 11న పంజాబ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.
