Sunrisers Hyderabad : అవేశ్ ఖాన్ పై బీసీసీఐకి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫిర్యాదు?

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడింది.

Sunrisers Hyderabad likely to write to BCCI over controversial calls in IPL 2026

  • ఐపీఎల్ 2026లో అంపైర్ల నిర్ణ‌యాల‌పై స‌న్‌రైజ‌ర్స్ అసంతృప్తి
  • బీసీసీఐకి లేఖ రాసే యోచ‌న‌లో ఎస్ఆర్‌హెచ్‌

Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఓ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌గా మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ఓట‌ముల‌ను చ‌విచూసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ప్ర‌స్తుతం ఐదో స్థానంలో ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మైదానంలో చోటుచేసుకున్న కొన్ని సంఘ‌ట‌నల కార‌ణంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ప్ర‌స్తుతం తీవ్ర అసంతృప్తితో ఉంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐకి ఓ లేఖ‌ను రాయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

Hardik Pandya : రాజ‌స్థాన్‌తో ముంబై మ్యాచ్ నేడు.. హార్దిక్ పాండ్యా ఆడేనా? ముంబై కోచ్ ఏమన్నాడంటే?

ఆదివారం (ఏప్రిల్ 5)న ల‌క్నోసూపర్ జెయింట్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో ల‌క్నో ఆట‌గాడు అవేశ్ ఖాన్ ప్ర‌వ‌ర్తించిన తీరు వివాదాస్ప‌ద‌మైంది. ఈ ఓవ‌ర్‌ను స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఐదో బంతిని ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ లాంగాఫ్ దిశ‌గా షాట్ ఆడాడు. అయితే బాల్ బౌండ‌రీ దాట‌క‌ముందే.. డ‌గౌట్‌లో ఉన్న అవేశ్ ఖాన్ బ్యాట్‌తో బంతిని మ‌ళ్లీ మైదానంలోకి కొట్టాడు.

అయితే.. అప్ప‌టికి బాల్ డెడ్ బాల్ కాలేద‌ని, త‌మ‌కు పెనాల్టీ ప‌రుగులు కేయించాల్సి ఉంద‌ని స‌న్‌రైజ‌ర్స్ వాదిస్తోంది. అయితే.. వాస్త‌వానికి అక్క‌డ ఫీల్డ‌ర్ ఎవ‌రూ లేరు. దీంతో అది బౌండ‌రీని అడ్డుకునే, ఫీల్డ‌ర్‌కు అడ్డువ‌చ్చే ప్ర‌య‌త్నం కాద‌ని భావించిన అంపైర్లు ఆ బంతికి బౌండ‌రీ ఇచ్చారు. దీంతో ల‌క్నో విజేత‌గా నిలిచింది.

KKR vs PBKS : కోల్‌క‌తాకు వ‌రుణుడి సాయం.. పాయింట్ల ఖాతా ఓపెన్‌..

ఈ నిర్ణ‌యంతో పాటు ఆర్‌సీబీతో మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్‌ను ఔట్ ఇవ్వ‌డం, కోల్‌క‌తా మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ ఔట్ ల‌పైనా స‌న్‌రైజ‌ర్స్ అసంతృప్తితో ఉంది. వీటిపైనే బీసీసీఐకి లేఖ రాయాల‌ని ఎస్ఆర్‌హెచ్‌ భావిస్తోంది.