Suryakumar Yadav : దక్షిణాఫ్రికాతో ఓటమి త‌రువాత భార‌త్ పుంజుకోవ‌డానికి బాహుబ‌లి పాట ఎలా సాయం చేసిందంటే?

దక్షిణాఫ్రికాతో ఓడిపోయిన త‌రువాత భార‌త జ‌ట్టు ఎలా పుంజుకుంది అనే విష‌యాన్ని కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav ) వెల్ల‌డించాడు.

Suryakumar Yadav says How Baahubali Song Helped India Bounce Back in T20 World Cup 2026

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ద‌క్షిణాఫ్రికా చేతిలో ఓట‌మి
  • భార‌త్ పుంజుకోవ‌డానికి బాహుబ‌లి పాట సాయం
  • వెల్ల‌డించిన కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్

Suryakumar Yadav : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 విజేత‌గా భార‌త్ నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 96 ప‌రుగుల తేడాతో టీమ్ఇండియా గెలుపొందింది. ఇది భార‌త దేశానికి మూడో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కావ‌డం విశేషం. ఈ ఘ‌న‌త సాధించిన తొలి జ‌ట్టుగా నిలిచింది.

వాస్త‌వానికి ఈ టోర్న‌మెంట్ అంత‌టా భార‌త జ‌ట్టు అద్భుతంగా ఆడింది. అయితే.. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జ‌రిగిన ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ ఓట‌మి భార‌త్ సెమీస్ అవ‌కాశాల‌ను ప్ర‌మాదంలో ప‌డేసింది. అంతేకాదండోయ్‌ వెస్టిండీస్‌తో మ్యాచ్ ను క్వార్ట‌ర్ ఫైన‌ల్‌గా మార్చింది. స‌ఫారీ పై ఓట‌మి నుంచి తేరుకున్న భార‌త్ విండీస్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌, ఫైన‌ల్‌లో కివీస్‌ను ఓడించి క‌ప్పును ముద్దాడింది.

LSG : ఐపీఎల్ 2026 ముందు కీల‌క ప‌రిణామం.. అమ్మ‌కానికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌..!

దక్షిణాఫ్రికాతో ఓడిపోయిన త‌రువాత భార‌త జ‌ట్టు ఎలా పుంజుకుంది అనే విష‌యాన్ని ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం అనంత‌రం ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించాడు. గత రెండేళ్లుగా జట్టు బలమైన ప్రదర్శనలను హైలైట్ చేసే వీడియోల‌ను ఆటగాళ్లకు చూపించామని భారత కెప్టెన్ వివరించాడు.

ఈ వీడియోలో శక్తివంతమైన బ్యాటింగ్, ప్రాణాంతక బౌలింగ్ క్షణాలు ఉన్నాయన్నాడు. ఇవి ఆటగాళ్లను ఉత్సాహపరిచాయని చెప్పుకొచ్చాడు. ఇక ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ప్రాక్టీస్ సెషన్‌లలో ఉత్తమ ఫీల్డర్‌కు రూ. 10,000 నగదు బహుమతిని ప్రవేశపెట్టినట్లు తెలిపాడు.

Suryakumar Yadav : అక్ష‌ర్ ప‌టేల్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. కోపంగా ఉండ‌డంతో..

‘ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్ త‌రువాత వీడియో విశ్లేష‌కుడు.. మేము గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో ఆడిన అత్యుత్త‌మ ఆట‌కు సంబంధించిన ప‌ది నిమిషాల వీడియోను బ్యాట‌ర్ల‌కు చూపించాడు. దీనికి బ్యాగ్రౌండ్‌లో బాహుబ‌లి పాట‌ను సెట్ చేశాడు. అలాగే బౌల‌ర్ల‌కు ‘ఓ షేరా తీర్ తే తాజ్’ సెట్ చేసిన వీడియోను చూపించాడు. దీంతో ఓట‌మిని మ‌రిచిపోయి తిరిగి బ‌లంగా పుంజుకున్నాం.’ అని సూర్య అన్నాడు.