Suryakumar Yadav Stumps Reporter On Favourites Question
Suryakumar Yadav Comments, : మరికొన్ని గంటల్లో ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆసియాకప్2025 లో పాల్గొనే 8 దేశాల కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ (Suryakumar Yadav Comments) ఆసియాకప్‌లో భారత జట్టు సన్నద్ధత గురించి తెలిపాడు.
గత వారమే యూఏఈ వచ్చామని చెప్పాడు. ఇప్పటికే పలు ప్రాక్టీస్ సెషన్లలలో పాల్గొన్నామని అన్నాడు. ఆసియాలోని అత్యుత్తమ జట్లతో ఆడడం ఓ ఛాలెంజింగ్‌లో ఉందన్నాడు.
టీమ్ఇండియా తమ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య యూఏఈతో బుధవారం ఆడనుంది. ఈ క్రమంలో యూఏఈ జట్టు గురించి మాట్లాడుతూ వాళ్లు చాలా బాగా ఆడుతున్నారన్నాడు. ఇటీవలే ఓ టోర్నమెంట్‌లో ఆడారన్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో విజయానికి దగ్గరగా వచ్చారని చెప్పుకొచ్చాడు. ఆసియాకప్‌లోనూ వాళ్లు మరింత రాణించాలని కోరుకున్నాడు.
IND vs PAK : సెప్టెంబర్ 14న పాక్‌తో మ్యాచ్.. టీమ్ఇండియా తుది జట్టులో చోటు దక్కేది ఎవరికంటే?
ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ పై స్పందించాడు. మైదానంలో తాము ఎప్పడూ దూకుడుగా ఉంటామన్నాడు. దూకుడు లేకుండా అసలు మైదానంలో అడుగేపెట్టమన్నాడు.
ఫిబ్రవరిలో చివరి టీ20..
భారత జట్టు చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. ఆ తరువాత మరో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. దీనిపైనా సూర్య మాట్లాడుతూ.. అవును మేం ఫిబ్రవరిలో టీ20 సిరీస్ ఆడాం. ఆ తరువాత ఐపీఎల్‌లో ఆటగాళ్లు ఆడారు. ఓ జట్టుగా మేం మ్యాచ్ ఆడి ఆరు నెలలు పైనే అయింది. అయినప్పటికి మేము పూర్తి సన్నద్ధతతో వచ్చాం అని సూర్య చెప్పుకొచ్చాడు.
ఇక ఆసియాకప్‌లో భారత్ ఫేవరెట్ కదా అని విలేకరులు అడుగగా.. ఎవరు అన్నారు? తాను అయితే ఎక్కడా వినలేదని చెప్పుకొచ్చాడు. టోర్నీలో పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగుతామని వెల్లడించాడు.
ఆసియా కప్ 2025కు భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.