T20 World Cup 2026 : టీ20ప్రపంచకప్‌కు యూఎస్ఏ జట్టు ఇదే.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో స్టార్ ప్లేయర్ దూరం..
టీ20ప్రపంచకప్ 2026కు (T20 World Cup 2026) యూఎస్ఏ జట్టును ప్రకటించింది.
USA revealed their 15 member squad for T20 World Cup 2026
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 కోసం యూఎస్ఏ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులు గల బృందానికి మోనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తాడు. జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్ , మిలింద్ కుమార్, షాయన్ జహంగీర్, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్ లు తిరిగి జట్టులోకి వచ్చారు.
2024 టీ20 ప్రపంచకప్ ఆడినవారిలో 10 మంది ప్రస్తుత జట్టులో ఉన్నారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆడడం యూఎస్ఏకు ఇది రెండోది. 2024 టీ20 ప్రపంచకప్‌లో యూఎస్ఏ జట్టు పాకిస్తాన్‌ను సూపర్ ఓవర్లో ఓడించిన సంగతి తెలిసిందే. యూఎస్ఏ దెబ్బకు నాటి టోర్నీలో పాక్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక ప్రస్తుత టోర్నీలో యూఎస్ఏ ఏ జట్టుకు షాకిస్తుందోనని క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Ravi Shastri : 20లో ఆ రెండు 300 కొడుతాయ్.. టీ20 ప్రపంచకప్ ముందు రవిశాస్త్రి కామెంట్స్..
కీలక ఆటగాడైన ఆరోన్ జోన్స్‌ను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సస్పెండ్ చేయడంతో జట్టు నుంచి తొలగించారు.
10 players from 2024 edition return to feature for USA at the ICC Men’s #T20WorldCup 2026 in India & Sri Lanka 👌https://t.co/vomZBi8JZ2
— ICC (@ICC) January 30, 2026
తాజా టోర్నీలో భారత్, పాక్, నెదర్లాండ్స్, నమీబియాలతో కలిసి యూఎస్ఏ జట్టు గ్రూప్-ఏలో ఉంది. ఇక యూఎస్ఏ తమ తొలి మ్యాచ్ ఆతిథ్య భారత్‌తో ఆడనుంది. ఫిబ్రవరి 7న వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 10న కొలంబో వేదికగా పాక్‌తో తలపడనున్నారు.
టీ20 ప్రపంచకప్‌కు యూఎస్ఏ జట్టు ఇదే..
మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్ , సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, షుభా మొహ్సిన్, షుభా రంజానే.
