T20 World Cup 2021: నలుగురు అఫ్ఘాన్ల చేతిలో టీమిండియా సెమీస్ ఆశలు

టీ20 వరల్డ్ కప్ టోర్నీ 2021లో భాగంగా జరిగే అఫ్ఘానిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అత్యంత కీలకమైంది. ఇది ఆ రెండు జట్లకే కాదు టీమిండియా సెమీస్ ఆశలు కూడా దానిపైనే ఆధారపడి ఉన్నాయి.

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ టోర్నీ 2021లో భాగంగా జరిగే అఫ్ఘానిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అత్యంత కీలకమైంది. ఇది ఆ రెండు జట్లకే కాదు టీమిండియా సెమీస్ ఆశలు కూడా దానిపైనే ఆధారపడి ఉన్నాయి. భారత జట్టు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న కివీస్ ఓటమి అనుకున్నట్లుగా జరగాలంటే ఈ నలుగురు అఫ్ఘాన్‌ ఆటగాళ్లు తప్పక రాణించాలి.

రషీద్‌ ఖాన్‌
అఫ్ఘానిస్తాన్ మాజీ కెప్టెన్.. స్పిన్నర్ టీ20 క్రికెట్లోనే అత్యంత విలువైన ఆటగాడు‌. ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ తో వెలుగులోకి వచ్చిన ఈ స్పిన్నర్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశవాలీ లీగ్ లు ఆడటంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ లోనూ సత్తా చాటాడు. మొత్తం 288 టీ20 మ్యాచులు ఆడి 399 వికెట్లు తీశాడు. 5/3 అత్యుత్తమ గణాంకాలతో ఉన్న రషీద్… కేన్‌ విలియమ్సన్‌ ఆటతీరుపై పూర్తి అవగాహన ఉంది. మార్టిన్‌ గప్తిల్‌నూ బోల్తా సామర్థ్యం ఉంది. అంతుచిక్కని గూగ్లీలతో ఎవరినైనా ఔట్‌ చేయగలడు.

మహ్మద్‌ నబీ
అఫ్ఘానిస్తాన్ ప్రస్తుత కెప్టెన్ నబీ జట్టుకు అత్యంత కీలకం. బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లోనూ రాణించగలడు. అంతర్జాతీయ క్రికెట్‌ లీగ్‌లలో ఆడిన అనుభవంతో చెలరేగుతున్నాడు. ఫ్లయిటెడ్‌ డెలివరీలతో బ్యాటర్లను అడ్డుకోగలడు. 308 టీ20లు ఆడిన నబీ 4వేల 801 పరుగులు చేశాడు. 293 వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్‌ సహ ఆటగాడైన విలియమ్సన్‌, ఇతర కివీస్‌ ఆటగాళ్ల ఆటతీరుపై అవగాహన ఉంది.

……………………………………….. : అతినిద్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందా?..

ముజీబుర్‌ రెహ్మాన్
అత్యంత కీలక బౌలర్‌. పవర్‌ప్లేలో మిస్టరీ స్పిన్‌తో సీనియర్లనే బోల్తా కొట్టించగలడు. ఈ యువ స్పిన్నర్‌కూ ఐపీఎల్‌, బిగ్‌బాష్‌, సీపీఎల్‌, పీఎస్‌ఎల్‌ ఆడిన అనుభవం ఉంది. 152 మ్యాచుల్లోనే 171 వికెట్లు తీశాడు. ప్రస్తుతమున్న ఫిట్‌నెస్‌ ఇబ్బందులను దాటుకుని.. రాణిస్తే మ్యాచ్‌ లో చక్కగా రాణించగలడు.

హజ్రతుల్లా జజాయ్‌
అఫ్ఘాన్‌ ఎక్కువ స్కోరు చేయాలన్నా.. లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించాలన్నా ఓపెనర్‌ హజ్రతుల్లా జజాయ్‌ కీలకం. బ్యాటుతో పవర్‌ప్లేలో నిర్భయంగా షాట్లు ఆడేస్తాడు. అతడు హిట్టైతే భారీ స్కోరుకు బాటలు పడ్డట్లే. ఇప్పటి వరకు 69 టీ20ల్లో వెయ్యి 986 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 10 అర్ధసెంచరీలూ అతని ఖాతాలో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు