Oversleeping : అతినిద్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందా?..

ప్రతి రోజూ రాత్రి 7-8 గంటల సమయం నిద్రపోయే వారికంటే, 8-9 నిద్రపోయే వారిలో డెత్ రేట్స్ అధికంగా ఉన్నట్లు కొన్ని పలు అధ్యనాలు కనుగొన్నారు.

Oversleeping : అతినిద్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందా?..

Sleep

Oversleeping : ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. మనిషి జీవితంలో నిద్ర ఒక భాగం…సహజ నిద్ర మెదడును చురుకుదనం చేస్తుంది. శారీరకంగా, మానసికంగా ఉత్తేజపరుస్తుంది. అయితే ఈ నిద్రకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఎక్కువగా నిద్రపోయినా సమస్యలు తప్పవు..తక్కువగా నిద్రపోయినా సమస్యలు తప్పవు.. అందుకే వేళకు తగినంత నిద్రపోవాలి. సాధారణంగా ప్రతి మనిషి 8 గంటలు నిద్రపోతే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోతే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని పరిశోధకుల తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.

ఎక్కువ సమయం నిద్రపోయే వారికి గుండెపోటు ముప్పుకు గురై అకాల మరణాలకు గురవుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 62 ఏళ్ల వయస్సున్నవారిలో స్ట్రోక్‌ రిస్క్‌ పై అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ మెడికల్‌ జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం. దాదాపు 32 వేల మందిపై జరిపిన అధ్యయనాల్లో స్ట్రోక్‌ రిస్క్‌ గురించి పరిశోధకులు వివరించారు. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం కలిగితే మెదడు కణజాలాలు దెబ్బతింటాయి. ఫలితంగా హార్ట్ ఫెయిల్ అవుతుంది.

అతి తక్కువగా నిద్రపోతే 82 శాతం స్ట్రోక్‌, రాత్రి పూట ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే, తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్‌ ముప్పు 23 శాతం ఎక్కువని తాజా అధ్యయనం చెబుతోంది. స్ట్రోక్‌ వచ్చినవారిలో అధిక నిద్ర స్ట్రోక్‌కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ, స్ట్రోక్‌ వచ్చినవారిలో తరచుగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలలో తేలింది.

వారాంతంలో లేదా సెలవుల్లో నిద్రించే సమయం కంటే అధిక సమయం నిద్రపోవడం వల్ల కొందరికి అధిక తలనొప్పికి దారితీస్తుంది. పరిశోధకులు ఈ ప్రభావం అతిగా నిద్రపోవటం సెరోటోనిన్ సహా, మెదడులో కొన్ని న్యూరోట్రాన్స్మిటర్లు దీనికి కారణంగా భావిస్తున్నారు. అధిక నిద్ర వల్ల కూడా డిప్రెషన్ కు లోనవుతారని కొన్ని స్టడీస్ కనుగొనబడ్డాయి. నర్సెస్ ‘ఆరోగ్యం స్టడీ ప్రకారం దాదాపు 72,000 మహిళలు మీద చేసిన అధ్యయనం ప్రకారం రాత్రిల్లో ప్రతి తొమ్మిది నుంచి 11 గంటల పడుకున్నమహిళల్లో ఎనిమిది గంటల పడుకున్న మహిళల కంటే, పదకొండు గంటలు నిద్రించిన మహిళల్లో గుండె వ్యాధి 38% ఎక్కువ కలిగి ఉండే అవకాశం ఉందని తేలింది.

ప్రతి రోజూ రాత్రి 7-8 గంటల సమయం నిద్రపోయే వారికంటే, 8-9 నిద్రపోయే వారిలో డెత్ రేట్స్ అధికంగా ఉన్నట్లు కొన్ని పలు అధ్యనాలు కనుగొన్నారు. జ్ఞాపక శక్తి తగ్గడం, విచారంగా ఉండటం వంటి రుగ్మతలు తలెత్తుతాయట. కొలెస్ట్రాల్‌ స్థాయి.. బరువు పెరుగుదల కనిపిస్తాయి. అయితే అధిక నిద్రకు, స్ట్రోక్‌ సంభవించడానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో స్పష్టతపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎక్కువగా నిద్రించేవారిలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు, బరువు పెరుగుతున్నాయని, ఈ రెండు కారణాల వల్లే స్ట్రోక్‌ ప్రమాదం వస్తుందని పరిశోధకులు అంటున్నారు.