Abhishek Sharma
India vs Pakistan : టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ కొలంబో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, ఓపెనర్లుగా క్రీజులోకి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వచ్చారు. అభిషేక్ శర్మకు పాకిస్థాన్ జట్టుపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో అభిషేక్ శర్మ పాకిస్థాన్ జట్టుపై రెచ్చిపోతాడని, పరుగుల వరద పారుతుందని అందరూ భావించారు. కానీ, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా చెప్పి మరీ అభిషేక్‌ను ఔట్ చేశాడు.
Also Read : IND w Vs AUS w : ఆసీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా.. పూర్తి మ్యాచ్ ఆడకుండానే తొలి టీ20లో ఘన విజయం
ఐసీసీ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. యూఎస్ఏతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్ శర్మ.. పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండు సార్లు డకౌట్ అయిన మూడో భారత ఓపెనర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. గతంలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ భారత జట్టు తరపున ఓపెనర్లుగా వచ్చి రెండు సార్లు డకౌట్ అయ్యారు. అయితే, అభిషేక్ శర్మ మొదటి రెండు టీ20 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌లలో డకౌట్ కావడం విశేషం.
ఇదిలాఉంటే.. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో డకౌట్ అయిన భారత ఓపెనర్ల జాబితాలో అభిషేక్ శర్మ కూడా చేరాడు. గతంలో గౌతమ్ గంభీర్ (2007, 2012), రోహిత్ శర్మ (2021), అభిషేక్ శర్మ (2026) ఔట్ అయ్యారు.
చెప్పిమరీ ఔట్ చేసిన పాక్ కెప్టెన్..
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో అభిషేక్ శర్మను ఆడించాలని కోరాడు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. మీరు ఆడించాలని కోరుకుంటే మేం ఆడిస్తాం అంటూ సమాధానం ఇచ్చాడు. చెప్పినట్లుగానే భారత తుది జట్టులో అభిషేక్ శర్మ చేరాడు. కానీ, పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా రచించిన వూహ్యంలో చిక్కుకున్న అభిషేక్ డకౌట్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు. అభిషేక్ ఓపెనర్‌గా క్రీజులోకి రాగానే.. స్వయంగా సల్మాన్ అలీ ఆఘా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్లో నాల్గో బంతికే అభిషేక్ శర్మ డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. పాకిస్థాన్ జట్టుపై అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడతాడని భావించిన ఫ్యాన్సుకు భారీ నిరాశనే మిగిల్చాడు. అభిషేక్ అవుట్ కాగానే.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
That reaction from Rohit Sharma after Abhishek Sharma’s wicket… 💔#INDvsPAK #INDvPAKWatchlist #IndvPakOnJioHotstar #T20WorldCup2026 #T20WorldCup pic.twitter.com/8EEFwp5B9k
— Rakeshchandra Yadav 🇮🇳 (@rakeshchandray2) February 15, 2026