Abhishek Sharma : జెర్సీ కాదురా అయ్యా.. ముందు నీ మైండ్ సెట్ కాస్త మార్చుకో.. సునీల్ గవాస్కర్ సలహాను పట్టించుకోవా..!
టీ20 ప్రపంచకప్ 2026లో టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఇంత వరకు పరుగుల ఖాతా తెరవలేదు.
- Thota Vamshi Kumar
- Published On : February 19, 2026 / 10:32 AM IST
T20 World Cup 2026 Abhishek Sharma Wearing Mohammed Siraj Jersey
Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026లో టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంత వరకు పరుగుల ఖాతా తెరవలేదు. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు అభిషేక్ మూడు మ్యాచ్‌లు ఆడగా అన్ని మ్యాచ్‌ల్లో డకౌట్లు అయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాడిగా చెత్త రికార్డును నమోదు చేశాడు. ఆశిష్ నెహ్రాతో కలిసి అతడు అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది, శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్ చెరో ఐదు సార్లు డకౌట్‌లతో అగ్రస్థానంలో ఉన్నారు.
ఈ మెగాటోర్నీలో అమెరికా, పాకిస్థాన్ మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన అభిషేక్ కనీసం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అయినా పరుగుల ఖాతా తెరిచి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడతాడని భావించగా మరోసారి నిరాశే ఎదురైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఆర్యన్ దత్ బౌలింగ్‌లో మూడో బంతికి ఔట్ అయ్యాడు. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి స్టంప్స్‌ను తాకింది. దీంతో మరోసారి అతడు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పేసర్ మహ్మద్ సిరాజ్ జెర్సీ ధరించడం గమనార్హం.
ప్రస్తుతం అభిషేక్ శర్మపై విమర్శల జడివాన కురుస్తోంది. జెర్సీ మారిస్తే అదృష్టం రాదని, ముందు మైండ్ సెట్ మార్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నాడు. తొలి బంతికే సిక్స్ కొట్టాల్సిన పని లేదని, ముందు క్రీజులో నిలదొక్కుకుని ఆ తరువాత విధ్వంసం సృష్టించాలని పలువురు మాజీ క్రికెటర్లు సైతం సూచిస్తున్నారు.
సునీల్ గవాస్కర్ సలహా..
నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఓ సలహా ఇచ్చాడు. ముందు సింగిల్ తీయాలని సూచించాడు. ఆ తరువాత అంతా సర్దుకుంటుందని చెప్పాడు.
