T20 World Cup 2026 Afghanistan win by 5 wickets against United Arab Emirates
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఎట్టకేలకు అఫ్గానిస్థాన్ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన అఫ్గాన్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. సోమవారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Afghanistan trump past UAE in a gripping contest at the #T20WorldCup 💪
📝: https://t.co/GHf2c9yRGv pic.twitter.com/zgokgxEAGM
— ICC (@ICC) February 16, 2026
161 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ (53; 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. దర్విష్ రసూలి (33; 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా.. ఆఖరిలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (40 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్ధిక్, ముహమ్మద్ అర్ఫాన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముహమ్మద్ జవదుల్లా ఓ వికెట్ సాధించాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో సోహైబ్ ఖాన్ (68; 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అలీషన్ షరాఫు (40) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముజీబ్ ఉర్ రెహమాన్ రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్ రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించాడు.