×
Ad

T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ వేళ భారత జట్టుకు బిగ్‌షాక్.. ఆస్పత్రి పాలైన స్టార్ ప్లేయర్..

T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా టీమిండియా రెండో మ్యాచ్ గురువారం ఆడనుంది. ఈ క్రమంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

Team India

T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా టీమిండియా రెండో మ్యాచ్ గురువారం ఆడనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ యూఎస్ఏతో ఆడి విజయం సాధించిన భారత జట్టు.. గురువారం రాత్రి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియా జట్టుతో రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే, రెండో మ్యాచ్ సందర్భంగా టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. భారత జట్టు కీలక ప్లేయర్ టోర్నీ నుంచి వైదొలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : TeamIndia : టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్.. యువ ప్లేయర్ల విన్యాసాలు.. గంభీర్ నవ్వులేనవ్వులు.. ఫొటోలు వైరల్

భారత జట్టులో గాయాలతో ఇబ్బందులు పడుతున్న వాషింగ్టన్ సుందర్, జస్ర్పీత్ బుమ్రా వంటివాళ్లు కోలుకుంటున్నారు. నమీబియాతో మ్యాచ్ కు వారు అందుబాటులోకి వచ్చారు. అయితే, ఇలాంటి శుభ తరుణంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి ఇంకా కోలేకోలేదు.

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడాడు. అయితే, పరుగులేమీ చేయకుండానే ఔట్ అయ్యాడు. ఆ తరువాత భారత జట్టు ఫీల్డింగ్ సమయంలో అభిషేక్ శర్మ మైదానంలోకి రాలేదు. దీంతో అతను అనారోగ్యంకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. ఉదర సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాడని.. నమీబియాతో మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడని చెప్పాడు. అయితే, అభిషేక్ శర్మ ఇంకా కోలేకోలేదు. ఆయన కడుపునొప్పితోపాటు తీవ్రమైన జ్వరంతో భాపడుతున్నట్లు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన టీమిండియా ప్లేయర్ల ప్రాక్టీస్ సెషన్‌లోనూ అభిషేక్ శర్మ పాల్గొనలేదు. ఈ విషయాన్నిభారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కటే కూడా ధ్రువీకరించారు. అభిషేక్ శర్మ ఇప్పటికీ ఉదర సంబంధిత నొప్పితో బాధపడుతున్నాడు. పూర్తిగా కోలుకొని మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నామని తెలిపాడు.

మరోవైపు బీసీసీఐ వర్గాల ప్రకారం.. అభిషేక్ శర్మ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన కోలుకునేందుకు సమయం పడుతుంది. నమీబియాతో మ్యాచ్ కు మాత్రం అతడు అందుబాటులో ఉండకపోవచ్చు అని పేర్కొన్నాయి. అభిషేక్ శర్మ తుది జట్టులోకి రాకుంటే ఆయన స్థానంలో మళ్లీ ఓపెనర్ గా సంజూ శాంసన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే, అభిషేక్ కేవలం నమీబియాతో మ్యాచ్ కు మాత్రమే దూరంగా ఉంటాడా.. లేదంటే ఈనెల 15న జరిగే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరమవుతాడా అనే ఆందోళన భారత క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతుంది.