T20 World Cup 2026 England Target is 152 against Scotland
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్, స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ జట్టు 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 153 పరుగుల లక్ష్యం నిలిచింది.
స్కాట్లాండ్ బ్యాటర్లలో రిచీ బెరింగ్టన్ (49; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. మైఖేల్ జోన్స్ (33; 20 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించాడు.
Scotland are ALL OUT!
We will need 153 runs to win 🤞 pic.twitter.com/aunCyDDqSu
— England Cricket (@englandcricket) February 14, 2026
ఆలివర్ డేవిడ్సన్ (20 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ )టామ్ బ్రూస్ (24; 18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీశాడు. లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. సామ్ కర్రాన్, జామీ ఓవర్టన్ లు తలా ఓ వికెట్ సాధించారు.