T20 World Cup 2026 England Win by 5 wickets against Scotland
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ మరో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 153 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో టామ్ బాంటన్ (63 నాటౌట్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. జాకబ్ బెథెల్ (32 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), సామ్ కర్రాన్ (28 20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు.
IND vs PAK : పాక్ మీద గెలిస్తే ఆ కిక్కే వేరప్పా.. గతంలో ఆ కిక్ ఇచ్చిన 5 మ్యాచ్ లు ఇవే..
ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (2), జోస్ బట్లర్ (3) ఘోరంగా విఫలం అయ్యారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ సైతం నాలుగు పరుగులే చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాండన్ మెక్‌ముల్లెన్, బ్రాడ్ క్యూరీ, బ్రాడ్ వీల్, మైఖేల్ లీస్క్, ఆలివర్ డేవిడ్సన్ లు తలా ఓ వికెట్ తీశారు.
Banton brings us home! 💪
Victory in Kolkata with 10 balls to spare 🙌 pic.twitter.com/yfFpsUm2fN
— England Cricket (@englandcricket) February 14, 2026
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. స్కాట్లాండ్ బ్యాటర్లలో రిచీ బెరింగ్టన్ (49; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మైఖేల్ జోన్స్ (33; 20 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సామ్ కర్రాన్, జామీ ఓవర్టన్ లు తలా ఓ వికెట్ తీశారు.
ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్-సిలో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఇక గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌ను ఇటలీతో సోమవారం (ఫిబ్రవరి 16న) ఆడనుంది.